మూడేళ్ళ క్రితం వచ్చి వెళ్లిపోయిన గాడ్ ఫాదర్ ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా. ఎల్2 ఎంపురాన్ రిలీజ్ వేళ మోహన్ లాల్ కు దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 2022లో లూసిఫర్ రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ మీద చిరంజీవి ఎన్నో ఆశలు పెట్టుకుని దర్శకులను మార్చుకుంటూ వచ్చారు. ముందు సుజిత్ తో ఒక వెర్షన్ రాయించారు. తర్వాత సుకుమార్ సలహాలు తీసుకున్నారు. ఒక దశ దాటాక వివి వినాయక్ వచ్చాడని ప్రచారం జరిగింది. తర్వాత బాబీని స్వయంగా మెగాస్టారే అడిగారు. ఫైనల్ గా మోహన్ రాజా చేతికొచ్చింది. ఎంతో ఊహించుకుంటే యావరేజ్ దగ్గర ఆగిపోయింది.
లూసిఫర్ ఫలితం రిపీట్ కాకపోవడానికి ప్రధాన కారణం కొన్ని పాత్రలను తీసేసి మార్పులు చేయడమేనని మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. ఇది నిజమే. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ సెకండాఫ్ లో హీరో తమ్ముడిగా సీఎం పాత్రలో ఎంట్రీ ఇచ్చే టోవినో థామస్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. దాన్ని రామ్ చరణ్ తోనో లేదా సాయిధరమ్ తేజ్ తోనో చేయించి ఉంటే నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. కానీ అది పూర్తిగా తీసేసి చిరు, నయనతారల మీద ట్రాక్ నడపడంతో సోల్ పోయింది. దీంతో రెండో సగం భారంగా, ఎగ్జైట్ మెంట్ లేకుండా సాగుతుంది. ఇంటర్వెల్ దాకా ఉన్న గూస్ బంప్స్ తర్వాత ఆగిపోతాయి.
ఒకవేళ యధాతథంగా తీసి ఉంటే ఇప్పుడు ఎల్2 ఎంపురాన్ ని గాడ్ ఫాదర్ 2గా తీసే ఛాన్స్ దొరికేది. చిరంజీవి వయసుకు తగ్గట్టు ఇచ్చిన ఎలివేషన్లు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డ్యూయెట్లు లేకుండా సీరియస్ టోన్ కు కట్టుబడిన విధానం గాడ్ ఫాదర్ ని బెస్ట్ మూవీగా మలచలేకపోయాయి. సో ఎల్2ని రీమేక్ చేయాలన్నా ఛాన్స్ లేకుండా పోయింది. మోహన్ లాల్ మాత్రం సీక్వెల్ తో తెలుగులోనూ పెద్ద హిట్టు కొడతాననే నమ్మకంతో ఉన్నారు. ఫస్ట్ పార్ట్ డబ్బింగ్ వెర్షన్ థియేటర్ వెర్షన్ లో జరిగిన నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎల్లుండికి బాక్సాఫీస్ తీర్పు వచ్చేస్తుంది.
This post was last modified on March 25, 2025 7:04 pm
సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…