ఒక పెద్ద నటుడి కుటుంబం నుంచి ఒకరు నటనలోకి వస్తే.. ఆటోమేటిగ్గా వాళ్లు ఫేమస్ అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఇలాంటి గుర్తింపు కోరుకోకుండా సొంతంగా ఎదగాలని చూస్తారు. బాలీవుడ్లో పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ సింప్లిసిటీకి మారు పేరుగా ఉండే ఆమిర్ ఖాన్.. తన సోదరిని కూడా నటనలోకి తీసుకొచ్చిన విషయం చాలా మందికి తెలియదు. ఆమె పేరు నిఖత్ ఖాన్. సంతోష్ హెగ్డే అనే హిందును పెళ్లాడిన ఆమె నిఖత్ హెగ్డేగా మారారు. 90వ దశకంలో ఆమె నిర్మాతగా ఇండస్ట్రీలోకి రంగప్రవేశం చేశారు. తర్వాత మోడలింగ్ చేశారు. పదుల సంఖ్యలో బ్రాండ్స్‌కు ప్రచారం చేశారు. కొన్నేళ్ల నుంచి ఆమె నటిగా సినిమాలు చేస్తున్నారు.
‘పఠాన్’ సహా పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలోనే మోహన్ లాల్ సినిమా ‘ఎల్-2: ఎంపురాన్’లో కూడా నటించారు. ఐతే నిఖత్.. ఆమిర్ ఖాన్ సోదరి అనే విషయం ఆడిషన్లో ఈ సినిమా కోసం ఎంపికయ్యే వరకు తనకు తెలియదని దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించడం విశేషం. నిఖిత్ తనెవరో చెప్పకుండానే ఆడిషన్‌కు హాజరైందని పృథ్వీరాజ్ తెలిపాడు.
ఆడిషన్స్ అయ్యాక ఆమె పెర్ఫామెన్స్ నచ్చి తనను సినిమాలోకి తీసుకోవాలని తన కాస్టింగ్ డైరెక్టర్‌కు చెప్పానని.. అప్పుడే ఆమె ఆమిర్ సోదరి అనే విషయం తనకు చెప్పిందని పృథ్వీరాజ్ వెల్లడించాడు. ఆమిర్ తనకు బాగానే పరిచయం అని.. కానీ ఆయన చెల్లెలు నటి అని, తన సినిమాలో నటించడానికి ఆడిషన్ చేసిందని మాత్రం తెలియదని.. అప్పుడు షాకయ్యానని పృథ్వీరాజ్ చెప్పాడు. వెంటనే ఆమిర్‌కు ఫోన్ చేసి మాట్లాడానని.. నా సోదరి బాగానే చేస్తోందా అని అడిగితే.. ఆమె బెస్ట్ అని చెప్పినట్లు పృథ్వీరాజ్ వెల్లడించాడు. బ్లాక్ బస్టర్ మూవీ ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఎల్-2: ఎంపురాన్’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on March 21, 2025 7:50 pm
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…