Movie News

ఆంధ్రా కింగ్ పాత్రలో సీనియర్ స్టార్ ?

ఎనర్జిటిక్ స్టార్ రామ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పరుగులు పెడుతోంది. ఇప్పటికే కొన్నిషెడ్యూల్స్ పూర్తి చేశారు. హీరోతో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకు సంబంధించిన ఎపిసోడ్స్ ఆల్రెడీ అయిపోయాయని సమాచారం. దీనికి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు గత వారం నుంచే ప్రచారం జరుగుతోంది. టీమ్ ఖండించడం కానీ యూనిట్ సమర్ధించడం కానీ చేయలేదు కానీ ఫిలిం ఛాంబర్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. ఇక్కడ అసలు పాయింట్ అది కాదు. ఆంధ్రా కింగ్ అంటే ఎవరు అని.

మాములుగా ఫ్యాన్స్ అది రామ్ ని ఉద్దేశించిందే అనుకుంటారు. కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ఆంధ్రా కింగ్ అంటే ఒక సీనియర్ హీరోని ఉద్దేశించినది. ఆయన తాలూకానే మన రామ్ అన్న మాట. అంటే మల్టీస్టారరని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఆ రెండో పాత్ర పోషించే నటుడు ఎవరో ఇప్పటి దాకా లీక్ కాలేదు. తాజా అప్డేట్ ప్రకారం దానికి మోహన్ లాల్ దాదాపుగా అంగీకారం తెలిపినట్టు వినికిడి. దర్శకుడు మహేష్ బాబు ముందు కమల్ హాసన్ ఆ తర్వాత బాలకృష్ణని చాలా ప్రయత్నించాడట. కానీ డేట్లతో పాటు ఇతరత్రా కారణాలతో చివరికి కంప్లీట్ యాక్టర్ లాలెట్టన్ మోహన్ లాల్ ని వరించింది.

అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ కాల్ షీట్లు నిర్ధారించుకున్నాక అనౌన్స్ మెంట్ చేసే ఛాన్స్ ఉంది. పల్లెటూరి నేపథ్యం, టౌన్ కాలేజీ, అభిమాన హీరో మీద పిచ్చి, క్యూట్ లవ్ స్టోరీ ఇలా రకరకాల అంశాల చుట్టూ మహేష్ బాబు ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ రెండూ మిక్స్ చేసి సబ్జెక్టు రాసుకున్నాడట. అవసరానికి మించిన మాస్ జోలికి వెళ్లి వరుస డిజాస్టర్లు చూసిన రామ్ తిరిగి తన పాత స్కూల్ కు వచ్చినట్టు ఆల్రెడీ వర్కింగ్ స్టిల్స్ చెప్పేశాయి. తనకు సూటయ్యే పక్కింటి అబ్బాయి పాత్రలో మెప్పిస్తాడని టీమ్ అంటోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా డిసైడ్ కాలేదు.

This post was last modified on March 21, 2025 12:09 pm

Share

Recent Posts

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

8 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

4 hours ago