ఆ మధ్య ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కెఎన్ మాట్లాడుతూ తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇవ్వడం పెద్ద పొరపాటనే తరహాలో కామెంట్ చేయడం సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారం రేపింది. అయన అన్నది వైష్ణవి చైతన్యనని రకరకాల అర్థాలు తీసేశారు నెటిజెన్లు. దానికి కారణం లేకపోలేదు. బేబీ కాంబినేషన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ఎస్కెఎన్ ఒక సినిమా ప్లాన్ చేసుకుంటే తర్వాత అదే కాంబో వేరే బ్యానర్ కు వెళ్ళిపోయింది. దీంతో ఆయన హర్ట్ అయిపోయి అలా అన్నాడనే కోణంలో అనాలిసిస్ చేశారు. తర్వాత ఆ ఉద్దేశంతో అనలేదని ఎస్కెఎన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా జాక్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో వైష్ణవి చైతన్య ఈ వివాదం గురించి మాట్లాడింది. బేబీ టీమ్ తో పని చేయడం గొప్ప ఎక్స్ పీరియన్స్ అని, దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు ముందుకెళ్లలేదు తప్పించి ఎస్కెఎన్ ఎవరిని అన్నారో తెలియదని, ఆ మాటకొస్తే దాని గురించి వివరణ ఇస్తూ ఆయన వీడియో విడుదల చేసింది గుర్తు చేసింది. ఏదైతేనేం మొత్తానికి కాంట్రావర్సి ఇక్కడితో ఆగిందని చెప్పాలి. అయినా ఇండస్ట్రీలో తరచుగా ఇలాంటి మార్పులు చేర్పులు సహజమే. ఒక జంట సంస్థ మారడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అవన్నీ బయటికి రావు. రానప్పుడే ఊహాజనిత కథనాలు చక్కర్లు కొడతాయి.
ఇక వైష్ణవి చైతన్యకు జాక్ సక్సెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే బేబీ తీసుకొచ్చిన ఇమేజ్ నిలబెట్టుకోవాలంటే హిట్లు పడాలి. ఆశిష్ తో చేసిన లవ్ మీ ఇఫ్ యు డేర్ దారుణంగా పోయింది. తర్వాత చేస్తున్న సినిమా జాకే. సిద్దు జొన్నలగడ్డ లాంటి క్రేజీ హీరోతో డ్యూయల్ రోల్ చేసే ఛాన్స్ దక్కడం మాములు విషయం కాదు. వర్కౌట్ అయితే మంచి ఆఫర్లు తలుపు తడతాయి. ఇంకా టయర్ 1, 2 హీరోల దృష్టిలో పడని ఈ బేబీ భామకు జాక్ ఇవ్వబోయే బ్రేక్ ఎలా ఉంటుందో చూడాలి. తన డెబ్యూకి భిన్నంగా మంచి లవబుల్ పాత్ర దక్కిందని చెబుతున్న వైష్ణవి చైతన్య ఇందులోనూ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టరే దక్కిందట.
This post was last modified on March 20, 2025 5:19 pm
ఒక పెద్ద నటుడి కుటుంబం నుంచి ఒకరు నటనలోకి వస్తే.. ఆటోమేటిగ్గా వాళ్లు ఫేమస్ అయిపోతారు. కానీ కొందరు మాత్రం…
టాలీవుడ్లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ఒక హాట్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో..…
దళిత సామాజిక వర్గంలో బీసీల మాదిరే చాలా కులాలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి ఎస్సీలుగా పరిగణిస్తున్నాం. బీసీల మాదిరే తమకూ…
నియోకజవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలతో డీఎంకే అదినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం…
హీరోలన్నాక ఫ్లాపులు సహజం. కాకపోతే వరసగా వస్తేనే ఇబ్బంది. నితిన్ కు ఈ సమస్య ఎదురయ్యింది. ప్రతిసారి ఒక హిట్టు…
యువ కథానాయకుడు నితిన్ కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ‘రాబిన్ హుడ్’ అతడి నిరీక్షణకు తెర దించుతుందనే…