శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని నిముషాలు మాత్రమే కనిపించే అప్పీయరెన్సులు అన్నీ కలుపుకుంటే ఈ మార్కు ఆల్రెడీ దాటిపోయినట్టే. కానీ ఫైనల్ గా నాగ్ ఏమంటారో చెబితే కానీ ఈ నెంబర్ పట్ల క్లారిటీ రాదు. లేటెస్ట్ గా వినిపిస్తున్న అప్డేట్ ప్రకారం నాగ్ హండ్రెడ్ మూవీని తమిళ దర్శకుడు కార్తీక్ చేతికి ఇవ్వొచ్చట. నిజానికీ టాక్ నెలల క్రితమే వచ్చింది కానీ నాగార్జున ఫైనల్ నెరేషన్ పట్ల అంత సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో లీక్ దగ్గరే ఆగిపోయింది. తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ఇంతకీ కార్తీక్ ఎవరంటే 2022 అశోక్ సెల్వన్ హీరోగా నటించిన ‘నితం ఓరువానం’ అనే సినిమా ద్వారా దర్శకత్వ డెబ్యూ చేశాడు. రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో విమర్శకులు మెచ్చుకున్నారు కానీ తెలుగు డబ్బింగ్ ‘ఆకాశం’ పేరుతో రిలీజ్ చేస్తే ఆడలేదు. అసలిది వచ్చిన విషయమే చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. తర్వాత అతను గ్యాప్ తీసుకున్నాడు. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా స్టోరీ సిద్ధం చేశారట. ఇటీవలే కూలి షూటింగ్ బ్రేక్ లో జరిగిన చర్చలో నాగార్జున సానుకూలంగా స్పందించినట్టు వినిపిస్తోంది.
నిజానికీ వందో సినిమా గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాకు దక్కాల్సింది. తండ్రి కొడుకులు నాగార్జున, అఖిల్ ప్రధాన పాత్రల్లో ఆయనో సబ్జెక్టు తయారు చేసుకున్నాడని ఆ మధ్య వినిపించింది. తర్వాత ఆయన పక్కకెళ్ళిపోయారు. ఇప్పుడు కార్తీక్ ది కార్యరూపం దాల్చడం పక్కా అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నా సామిరంగా సక్సెస్ కొట్టాక నాగార్జున సోలో హీరోగా సినిమా చేయలేదు. కుబేర, కూలి రెండింట్లో ప్రత్యేక పాత్రలే. ఏడాది గడిచిపోయినా కింగ్ మాత్రం తొందరపడకుండా అడుగులు వేస్తున్నారు. మరి కార్తీక్ ది కూడా అఫీషియల్ అయ్యేదాకా చెప్పలేం. అప్పటిదాకా అక్కినేని ఫాన్స్ ఎదురు చూడాల్సిందే.
This post was last modified on March 17, 2025 8:30 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…