మురుగదాస్ అనే పేరు ఒకప్పుడు ఒక బ్రాండ్. హీరోలు ఎవరన్నది సంబంధం లేకుండా ఆయన పేరు మీదే సినిమాలకు బిజినెస్ అయిపోయేది. రమణ (తెలుగులో ఠాగూర్), గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన దర్శకుడతను. ఐతే గత కొన్నేళ్లలో మురుగదాస్ నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు. మన మహేష్ బాబుతో చేసిన ‘స్పైడర్’తో ఆయన పతనం మొదలైంది.
ఆ తర్వాత సర్కార్, దర్బార్ లాంటి మామూలు సినిమాలొచ్చాయి మురుగదాస్ నుంచి. ఐతే మళ్లీ విజయ్‌తో మురుగదాస్ జట్టు కడుతుండటంతో ఈసారి ఆయన్నుంచి బ్లాక్‌బస్టర్ ఖాయమన్న అంచనాలతో ఉన్నారు అభిమానులు. ఈ చిత్రం ‘తుపాకి’కి సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది. విజయ్, మురుగదాస్ కాంబినేషన్ నుంచి ఇంతకుముందే అధికారిక సమాచారం కూడా బయటికి వచ్చింది. ఇక సినిమా పట్టాలెక్కడమే తరువాయి అనుకుంటున్నారంతా.
కానీ ఇప్పుడు అనూహ్యంగా మురుగదాస్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని నిర్మించనున్న సన్ పిక్చర్స్ అధినేతల్ని మురుగదాస్ కథ మెప్పించలేకపోయిందట. విజయ్ సైతం అంత సంతృప్తిగా లేకపోవడంతో మురుగదాస్ తనకు తానుగా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. విజయ్ డేట్లు తమ దగ్గరుండటంతో మురుగదాస్ స్థానంలో మరో దర్శకుడిని తీసుకొచ్చి సినిమా చేయించడానికి సన్ పిక్చర్స్ ప్రయత్నిస్తోంది.
వెట్రిమారన్ కోసం ట్రై చేయగా.. ఆయన ఖాళీ లేడని తెలిసింది. దీంతో గత ఏడాది ‘తడమ్’ సినిమాతో ఆకట్టుకున్న మగిల్ తిరుమణిని సంప్రదిస్తున్నారట. మగిల్ ఇప్పటిదాకా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేశాడు. ఐతే ‘తడమ్’ చాలా పెద్ద హిట్టయింది. ఈ చిత్రం తెలుగులో ‘రెడ్’ పేరుతో రీమేక్ అయ్యింది కూడా. ‘మాస్టర్’ను పూర్తి చేసి ఖాళీగా ఉన్న విజయ్ మన తెలుగమ్మాయే అయిన ‘ఆకాశం నీ హద్దురా’ దర్శకురాలు సుధ కొంగరతోనూ ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు.
This post was last modified on October 28, 2020 8:28 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…