సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో సెన్సేషనల్ హిట్ కొట్టారు. మిడ్ రేంజ్ బడ్జెట్లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ మూవీ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. చాలా ఏళ్లుగా నంబర్స్ గేమ్‌లో బాగా వెనుకబడిపోయిన వెంకీ.. ఈ చిత్రంతో తన సత్తాను చూపించారు. దీంతో ఆయన తర్వాత చేయబోయే సినిమా పట్ల అభిమానుల్లో అమితాసక్తి నెలకొంది. ఐతే వెంకీ ఒక ఫామ్‌లో లేని దర్శకుడితో జట్టు కట్టబోతున్నట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ కొంచెం షాకయ్యారు. ఆ దర్శకుడే సురేందర్ రెడ్డి.
ఒకప్పుడు అతనొక్కడే, కిక్, రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన సురేందర్‌కు చాలా ఏళ్లుగా సరైన విజయం లేదు. చివరి చిత్రం ‘ఏజెంట్’ పెద్ద డిజాస్టర్ అయింది. దాని కంటే ముందు చేసిన ‘సైరా’ ఓ మోస్తరుగా ఆడింది. అంతకుముందు తీసిన ‘కిక్-2’ కూడా డిజాస్టరే. ‘ఏజెంట్’ తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సురేందర్.. వెంకీ కోసం ఒక యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేశాడని.. వెంకీ కూడా ఈ సినిమా చేయడానికి సుముఖంగానే ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఐతే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మంచి ఊపుమీదున్న వెంకీ.. ఫాంలో లేని సూరితో జట్టు కట్టడం అవసరమా.. అయినా తన శైలిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేసుకోక, యాక్షన్ సినిమాలు ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తాయి.
ఐతే ఇంకా ఆ ప్రాజెక్టు కన్ఫమ్ కాకముందే.. ఇప్పుడు వెంకీ అభిమానులను కంగారు పెట్టే మరో న్యూస్ తెరపైకి వచ్చింది. గతంలో వెంకీతో ‘లక్ష్మీ’ సినిమా తీసిన సీనియర్ దర్శకుడు వి.వి.వినాయక్ మళ్లీ ఆయనకో కథ చెప్పారని.. సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. వినాయక్ ఒకప్పుడు టాప్ డైరెక్టరే కానీ.. గత దశాబ్ద కాలంలో ఆయన ట్రాక్ రికార్డు ఘోరంగా. రీమేక్ అయిన ‘ఖైదీ నంబర్ 150’ని మినహాయిస్తే.. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్, ఇంటిలిజెంట్ చిత్రాలతో దారుణంగా దెబ్బ తిన్నాడు. దీంతో ఆయనతో సినిమా చేయడానికి హీరోలు, నిర్మాతలు కొంచం ఆలోచిస్తున్నారు. ఇలాంటి స్థితిలో వెంకీతో ఆయన పేరు ముడిపడేసరికి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.
This post was last modified on March 11, 2025 5:25 am
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…