రేపు ఛావా తెలుగు వెర్షన్ విడుదల కాబోతోంది. మూడు వారాల తర్వాత తీసుకురావడంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ అనువాదం కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య భారీగానే ఉంది. గీతా ఆర్ట్స్ పంపిణి కావడంతో థియేటర్ల పరంగా మంచి కౌంట్ దక్కుతోంది. పోటీలో ఉన్న కింగ్స్టన్ లాంటి కొత్త రిలీజులకు పెద్దగా బజ్ లేకపోవడం ఛావాకు కలిసి వచ్చేలా ఉంది. అయితే పిల్లలకు పరీక్షలు మొదలుకావడం, వాళ్ళ కోసం పెద్దలు థియేటర్లకు దూరంగా ఉండటం లాంటి కొన్ని అంశాలు వసూళ్ల మీద ప్రభావం చూపించే అంశాన్ని కొట్టిపారేయలేం. అయితే అసలు సమస్య, టాపిక్ ఇది కాదు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేపు మళ్ళీ రీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ స్పందన వస్తుండటం చూసి డిస్ట్రిబ్యూటర్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే కోటిన్నర దాకా వసూలు కావొచ్చని, అందులో హైదరాబాద్ నుంచే అరవై లక్షలు రావొచ్చని చెప్పడం చూస్తే ఫ్యాన్స్ ఎంతగా తపించిపోతున్నారో అర్థమవుతోంది. బుక్ మై షోలో గత నాలుగైదు రోజులుగా సగటున పది నుంచి ఇరవై వేల మధ్య టికెట్లు ప్రతి ఇరవై నాలుగు గంటలకు అమ్ముడుపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీస్, యూత్ సైతం చూసేందుకు ఎగబడటం గమనార్షం.
చిన్నోడు పెద్దోడు రూపంలో మహేష్ బాబు, వెంకటేష్ చేస్తున్న రచ్చ ఏకంగా ఛావాకు బ్రేక్ వేసేలా ఉంది. ఎందుకంటే ఒకే వారంలో రెండు సినిమాలు ఒకే స్థాయిలో అది కూడా అన్ సీజన్లో ఆదరణ దక్కించుకోవడం అంత ఈజీ కాదు. పైగా సిరిమల్లె చెట్టు మీదున్న ఆసక్తి ఛావాకు రెట్టింపు కనిపిస్తేనే కలెక్షన్లు బాగుంటాయి. అయితే పదమూడేళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో వెంకీ, మహేష్ ల మీద ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్న వైనం ఛావాకు అంతో ఇంతో డ్యామేజ్ చేసేదే. ప్రమోషన్ల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ విచ్చేసిన విక్కీ కౌశల్ టాలీవుడ్ జనాలు ఛావాని ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాని కోసం ఎదురు చూస్తున్నాడు.
This post was last modified on March 6, 2025 1:05 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…