‘మా అమ్మ గురించి అలా ఊహాజనిత వార్తలు రాయొద్దు. ప్రచారం చేయొద్దు’ అని ప్రముఖ గాయని కల్పన కుమార్తె.. మీడియాకు విన్నవించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పనను అంటిపెట్టుకునే ఉన్నట్టు ఆమె తెలిపారు. అమ్మ ఆరోగ్యం నిలకడగానే ఉంది. దీనిపై అపోహలు ప్రబలేలా మీడియా వ్యవహరించడం సరికాదు. అని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. తన తల్లి ఆత్మహత్యా యత్నం చేయలేదని ఆమె స్పష్టం చేసింది.
మా అమ్మ ఆత్మహత్య చేసుకునేందుకు పిరికి మనస్తత్వంతో లేదు. ఆమె చాలా ద్రుఢంగా ఉన్నారు. ప్రశాంతత కోసం.. వేసుకునే నిద్రమాత్రల డోస్ కొంచెం ఎక్కువైంది. దీనిపై లేని పోని ప్రచారం చేయడం దారుణం. మా నాన్న-అమ్మ సంతోషంగానే ఉన్నారు. వారి మధ్య ఎలాంటి కలతలు లేవు. కానీ, మీడియాలో ప్రచారం అవుతున్నది వాస్తవం కాదు. ఇలాంటివాటిని ఆపేయండి అని కల్పన కుమార్తె మీడియాకు విజ్ఞప్తి చేశారు.
కాగా.. కల్పన దక్షిణాదిలోనే కాకుండా.. ఖవ్వాలీ వంటి ఉత్తరాది సంగీతంలోనూ పేరు తెచ్చుకున్నారు. పంజాబీలోనూ ఆమె చేసే సంకీర్తనలకు ఆయా రాష్ట్రాల్లో మంచిపేరుంది. తాజాగా ఆమె నిద్రమాత్రలు వేసుకుని అపస్మారక స్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఈ విషయంపై భిన్నమైన వాదనలు, కథనాలు వెలుగు చూశాయి. కుమార్తెతో ఉన్న విబేదాల కారణంగానే కల్పన ఆత్మహత్యా యత్నం చేశారన్నదిఒకటైతే.. ఆర్థిక సమస్యలు, భర్తతో ఉన్న విభేదాలే కారణమని మరో ప్రచారం ఉంది. వీటిని తాజాగా ఆమె కుమార్తె ఖండించింది.
మరోవైపు.. కల్పన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కళ్లు తెరిచి చూడగలిగే స్థాయికి చేరుకుంటున్నట్టు బులిటిన్‌లో వివరించారు. ఆమె కోలుకుంటున్నారని.. ఆసుపత్రికి వచ్చిన ప్పటికి ఇప్పటికి మార్పు వచ్చిందని వైద్యులు వివరించారు.
This post was last modified on March 5, 2025 3:50 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…