విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజుల కాంబో ది ఫ్యామిలీ స్టార్ రూపంలో ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయిన సంగతి తెలిసిందే. దీని మీద ఇద్దరు పెట్టుకున్న గంపెడాశలు బాక్సాఫీస్ సాక్షిగా నీరుగారిపోయాయి. దర్శకుడు పరశురామ్ మళ్ళీ గీత గోవిందం మేజిక్ ని రీ క్రియేట్ చేయలేకపోయాడు. ఇదిలా ఉంచితే దిల్ రాజు గత ఏడాది రౌడీ హీరోగా ఇంకో సినిమా అధికారికంగా ప్రకటించడం గుర్తే. రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఈ వేసవి నుంచి ప్రారంభం కాబోతోంది. గత ఏడాది లీకైన ‘రౌడీ జనార్ధనా’ టైటిల్ ని ఇవాళ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ప్రెస్ మీట్ లో రాజుగారు అఫీషియల్ చేశారు.
కత్తి నాదే, నెత్తురు నాదే, యుద్ధం నాదే క్యాప్షన్ తో గతంలో రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనా పెంచింది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో మంచి వయొలెన్స్ కూడిన యాక్షన్ డ్రామాగా దీని గురించి లీకులు ఉన్నాయి కానీ అంతకు మించి ఎక్కువ డీటెయిల్స్ బయటికి రాలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇది అయ్యాక రౌడీ జనార్ధన సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. వీటితో పాటు శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ తో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీకి ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ రెండు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేకపోలేదు.
గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండ పేరు జనార్దనే. తిరిగి దాన్నే మళ్ళీ వాడుకోబోతున్నారు. అయితే తండ్రి పేరు ఇదే కాబట్టి సెంటిమెంట్ గా భావించి ఉండొచ్చు. వరస ఫ్లాపులు చవి చూస్తున్న రౌడీ హీరోకు సాలిడ్ బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది. మార్కెట్, బిజినెస్ లెక్కలు పట్టించుకోకుండా కంటెంట్ డిమాండ్ చేస్తే తన మీద ఎంత ఖర్చు పెట్టడానికైనా నిర్మాతలు వెనుకాడటం లేదు. ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నవన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే. ఒకదానికొకటి సంబంధం లేని జానర్లే. మూడింటి మీద పెడుతున్న బడ్జెట్ మూడు వందల కోట్ల పైమాటేనని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on March 5, 2025 1:19 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…