Movie News

షాక్ ఇస్తున్న సిరిమల్లె చెట్టు బుకింగ్స్

ఈ శుక్రవారం రీ రిలీజ్ కాబోతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి రాంగ్ టైమింగ్ ఎంచుకున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ బుకింగ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటీవలే ఇంటర్ పరీక్షలు మొదలుకావడంతో పాటు ఇతర తరగతుల అన్యువల్ ఎగ్జామ్స్ ఇదే నెలలో ఉన్నాయి. వీటి వల్ల వసూళ్లు భారీగా ఉండవేమోనని మహేష్ బాబు, వెంకటేష్ అభిమానులు భావించారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా బుక్ మై షోలో సగటున రోజుకు 15 వేల నుంచి 20 వేల దాకా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది కేవలం ఒక యాప్ నుంచి నమోదైన డేటా. డిస్ట్రిక్ట్ ఇతరత్రా ప్లాట్ ఫార్మ్స్ లెక్కలు వేరు.

నాలుగు రోజులు ముందుగానే ఇంత ట్రెండింగ్ లో రావడం విశేషమే. విచిత్రం ఏంటంటే మార్చి 7 రిలీజ్ కాబోతున్న మరో ఏడెనిమిది కొత్త సినిమాలు దేనికీ ఇంత బుకింగ్స్ లేవు. ఛావా తెలుగు డబ్బింగ్ మీద సిరిమల్లె చెట్టు ప్రభావం గట్టిగా ఉండబోతోంది. ముఖ్యంగా మెయిన్ థియేటర్స్ ని ఫ్యాన్స్ ఎగబడి బుక్ చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్ సుదర్శన్, విశ్వనాథ్ లాంటి సింగల్ స్క్రీన్లలో మొదటి రోజు నాలుగు ఆటలు సోల్డ్ అవుట్ పెట్టేశారు. మల్టీప్లెక్సుల్లో సైతం అమ్మకాలు శరవేగంగా ఉన్నాయి. గత ఏడాది మురారి తర్వాత తిరిగి అంత స్థాయి స్పందన దీనికే వచ్చేలా ఉందని డిస్ట్రిబ్యూటర్స్ టాక్.

చూస్తుంటే ప్రేక్షకులు ఈ సినిమాకు గట్టిగానే వెళ్లేలా ఉన్నారు. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ లేదు. కౌంట్ సంగతి పక్కనపెడితే మొదటి రోజే చూడాలనే ఉత్సుకతను కొత్త రిలీజులు కలిగించలేక పోతున్నాయి. టాక్, రివ్యూలు వస్తే తప్ప జనం వెళ్ళరు. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి అలాంటి సమస్య లేదు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం చూసిన మూవీ మళ్ళీ థియేటర్లో వచ్చే అవకాశం వస్తే వదులుతారా. ఇప్పట్లో మహేష్ ని స్క్రీన్ మీద చూసే అవకాశం లేకపోవడం, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఎంజాయ్ చేస్తున్న వెంకీ ఫ్యాన్స్ ఆనందం రెండూ కలగలసి మార్చి 7 థియేటర్లలో ఓ రేంజ్ సందడి చేయడం ఖాయమే.

This post was last modified on March 4, 2025 12:14 pm

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

8 minutes ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

34 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

2 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago