Movie News

50 రోజుల సంక్రాంతి – రికార్డులు పాతేసింది

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అర్ధ శతదినోత్సవం పూర్తి చేసుకుంది. పది ఇరవై కాదు ఏకంగా తొంభై రెండు కేంద్రాల్లో ఫిఫ్టీ డేస్ నమోదు చేయడం ఆషామాషీ విషయం కాదు. స్ట్రెయిట్, షిఫ్టింగ్ కలిపి ఈ నెంబర్ నమోదు కావడం విశేషం. ఈ విజయానికో ప్రత్యేకత ఉంది. నిజానికి సంక్రాంతికి వస్తున్నాంని పండగ బరిలో దింపాలనే ఆలోచన నిర్మాత దిల్ రాజుకి తొలుత లేదు. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి ఒత్తిడి మేరకు సరేనన్నారు. పోటీలో రెండు మాస్ సినిమాలు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ఉన్నప్పటికీ వాటిని తోసిరాజి మరీ వెంకీ మామ విజేతగా నిలిచి మూడు వందల కోట్లు కొల్లగొట్టడం మాములు రికార్డు కాదు.

నందికొట్కూరు, పాయకరావుపేట, రాపూరు, చీపురుపల్లి లాంటి చిన్న సి సెంటర్లలోనూ సంక్రాంతికి వస్తున్నాం ఏడు వారాలకు పైగా ఆడటం సంచలనమే. ఈ ఫీట్ కొన్ని సెంటర్లలో కల్కి, దేవర, పుష్ప 2 వల్లే కాలేదు. అలాంటిది వెంకటేష్ టీమ్ అందుకోవడం గురించి కొన్ని నెలల తరబడి చెప్పుకోవాల్సి ఉంటుంది. పైగా ప్యాన్ ఇండియా రిలీజ్ లేకుండా కేవలం తెలుగు భాషకే పరిమితం చేసినా ఇన్ని నెంబర్లు నమోదు చేయడం ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది. ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఎడాపెడా డబ్బింగులు చేసుకుంటున్న చాలా సినిమాలకు సంక్రాంతికి వస్తున్నాం చదుకోవాల్సిన ఒక పాఠం లాంటిది.

ఇక్కడితో కథ అయిపోలేదు. ఓటిటిలోనూ సంక్రాంతికి వస్తున్నాం సత్తా చాటుతోంది. జీ5 గతంలో స్ట్రీమింగ్ చేసిన ఆర్ఆర్ఆర్, హనుమాన్ రికార్డు వ్యూస్ ని అవలీలగా దాటేస్తూ అక్కడా మైలురాళ్ళు పాతుతోంది. ఏదో పండగ సీజన్ లో గాలివాటం హిట్టు కొట్టేసిందన్న కొందరి కామెంట్లకు బలంగా సమాధానం ఇస్తోంది. కొంత కాలంగా డిజిటల్ రేసులో వెనుకబడ్డ జీ ఛానల్, ఓటిటికి కొత్త ఆక్సిజన్ గా మారింది. జనవరి ఫిబ్రవరి నెలల్లో తండేల్, మజాకా, లైలా, ది రిటర్న్ అఫ్ ది డ్రాగన్ లాంటి చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు చాలా ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని మరీ సంక్రాంతికి వస్తున్నాం ఈ ఫీట్ సాధించడం గొప్ప ఘనతే.

This post was last modified on March 4, 2025 10:35 am

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

20 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago