నిన్న శాటిలైట్, ఓటిటి ప్రీమియర్ రెండూ ఒకేసారి జరుపుకున్న సంక్రాంతికి వస్తున్నాం అనుకున్న దానికంటే ఎక్కువ భీభత్సమే చేస్తోంది. కేవలం పన్నెండు గంటల్లోనే 100 మిలియన్ నిమిషాల వ్యూస్ ని పదిహేను లక్షల వీక్షకుల ద్వారా రాబట్టి కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. ప్రసారం జరిగే సమయానికి జీ5కి ఫ్రెష్ గా 25 వేల సబ్స్క్రైబర్ లు చేరారని డిజిటల్ వర్గాల సమాచారం. ఇది కొత్త మైలురాయి. ఎందుకంటే ఈ ఓటిటికి నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, హాట్ స్టార్ అంత పాపులారిటీ లేదు. అడపాదడపా కొత్త పాత సినిమాలు, సీరియల్స్ తో నెట్టుకొస్తోంది. కానీ వెంకీ మామ దెబ్బకు కొత్త ఉత్సాహంతో పరుగులు పెడుతోంది.
గతంలో ఇదే ప్లాట్ ఫామ్ మీద వచ్చిన ఆర్ఆర్ఆర్, హనుమాన్ రెకార్డులను సంక్రాంతికి వస్తున్నాం దాటేయడం విశేషం. సోషల్ మీడియా ట్రెండ్స్ గమనిస్తే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఛానల్ లో ప్రసారం జరిగిన సమయంలో అత్యధిక శాతం ఇళ్లలో ఈ సినిమానే చూస్తున్నారు. యాడ్స్ వచ్చినా సరే మార్చకుండా దీనికే అతుక్కుపోయారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని పసిగట్టిన జీ టీమ్ గోదారి గట్టు మీద రామ సిలికవే పాటను రెండుసార్లు రిపీట్ వేయడం గమనార్హం. మాములుగా యాభై వంద రోజుల టైంలో థియేటర్లు ఫ్యాన్స్ కోసం ఇలా చేస్తుంటాయి కానీ టీవీలో మాత్రం అరుదు.
బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించిన సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు బుల్లితెరపై కూడా అంతే స్థాయిలో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడికి ఫ్యామిలీ పల్స్ మీద ఎంత పట్టు ఉందో మరోసారి అర్థమవుతోంది. పండగ సీజన్ కాబట్టి ఏదో ఆ ఊపులో హిట్టు కొట్టేసిందన్న కామెంట్స్ కి కూడా సమాధానం దొరికేసింది. ఒకవేళ అదే నిజమనుకుంటే టీవీలో వచ్చినప్పుడు జనాలు లైట్ తీసుకోవాలిగా. మంగళవారం యాభై రోజుల సంబరానికి సిద్ధమవుతున్న వెంకీ అభిమానులు ముఖ్య కేంద్రాల్లో భారీ సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా వేడుకలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయట.
This post was last modified on March 2, 2025 9:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…