లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో ఒకడు. ఖైదీ, విక్రమ్ చిత్రాలతో అతను ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. ముఖ్యంగా తాను తీసిన ప్రతి సినిమాకూ ఒక లిక్ పెడుతూ అతను క్రియేట్ చేసిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎంత పెద్ద ట్రెండ్‌గా మారిందో తెలిసిందే. ఐతే ఇప్పుడింత క్రేజ్ సంపాదించుకున్న లోకేష్.. తాను తీసిన తొలి చిత్రంలో మన యంగ్ హీరో సందీప్ కిషన్‌నే లీడ్ రోల్‌లో పెట్టాడు. ఆ చిత్రమే.. మానగరం. ఆ సినిమా సక్సెస్ అయింది.
ఐతే ‘మానగరం’ తర్వాత సందీప్.. లోకేష్‌తో కలిసి సినిమానే చేయలేదు. ఎల్సీయూలో భాగమైన మరే చిత్రంలోనూ కనిపించలేదు. సందీప్‌తో తొలి సినిమా చేసిన లోకేష్ ఇంత పెద్ద దర్శకుడు అయిపోవడం.. మళ్లీ తనతో సందీప్ జట్టు కట్టకపోవడం గురించి తన కొత్త చిత్రం ‘మజాకా’ సక్సెస్ మీట్లో విలేకరులు ప్రస్తావిస్తే.. సందీప్ కిషన్ దాని గురించి స్పందించాడు. లోకేష్‌తో తాను ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని.. మళ్లీ తామిద్దరం కలిసి చేస్తే అది తనకు, అతడికి బెస్ట్ మూవీ అయ్యుండాలనే ఉద్దేశంతో మళ్లీ సినిమా చేయలేదన్నాడు. తాను లోకేష్‌తో మళ్లీ సినిమా చేయబోతున్నానని.. అది ఎల్సీయూలో భాగమా కాదా అని తాను చెప్పలేనని సందీప్ అన్నాడు.
మరోవైపు లోకేష్ డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం ‘కూలీ’ గురించి సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా సెట్స్‌కు తాను వెళ్లానని.. అంతే కాక దాదాపు ముప్పావు గంట సినిమా చూశానని.. ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధించడం గ్యారెంటీ అని సందీప్ చెప్పడం విశేషం. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఉపేంద్ర సైతం ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నటిస్తున్న విషయం తాజాగా వెల్లడైంది.
This post was last modified on February 28, 2025 10:33 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…