Movie News

దృశ్యం-3… ఇక్క‌డొక‌టి, అక్క‌డొక‌టి

ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే బెస్ట్ థ్రిల్ల‌ర్ మూవీగా దృశ్యం సినిమాను చెప్పొచ్చు. ఈ మ‌ల‌యాళ‌ సినిమాను అనేక భాష‌ల్లో రీమేక్ చేస్తే.. అన్ని చోట్లా విజ‌య‌వంతం అయింది. హిందీలో అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా ఈ చిత్రాన్ని పున‌ర్నిర్మించ‌గా సూప‌ర్ హిట్ అయింది. ఐతే దృశ్యం సీక్వెల్‌ను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయ‌గా.. ఇటు తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్‌, అటు హిందీలో అజ‌య్ దేవ‌గ‌ణ్ రీమేక్ చేశారు. వెంకీ మూవీ ఓటీటీలో రిలీజ్ కాగా.. అజ‌య్ సినిమా థియేట‌ర్ల‌లోనే రిలీజై స‌క్సెస్ అయింది. దానికి మంచి స్పంద‌నే వ‌చ్చింది.

ఐతే ఇప్పుడు మోహ‌న్ లాల్ దృశ్యం-3 సినిమాకు రెడీ అవుతున్నాడు. ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్ ఇటీవ‌లే స్క్రిప్టు కూడా రెడీ చేశాడు. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్ మీదికి వెళ్ల‌బోతోంది. ఐతే మ‌ల‌యాళ వెర్ష‌న్ ప‌ట్టాలెక్క‌బోతుండ‌గానే.. వేరుగా హిందీలో దృశ్యం-3 చేయ‌డానికి రెడీ అవుతుండ‌డం విశేషం. త‌న చేతుల్లో ఉన్న వేరే సినిమాల‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ అజ‌య్ దేవ‌గ‌ణ్ దృశ్యం-3 చేయ‌డానికి సిద్ధమవుతున్నాడట. హిందీలో దృశ్యం, దృశ్యం-2 చిత్రాల‌ను రూపొందించిన అభిషేక్ పాఠ‌క్.. సొంతంగా దృశ్యం-3 స్క్రిప్టు రెడీ చేశాడ‌ట‌. మంచి ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో అత‌డి స్క్రిప్టు త‌యారైంద‌ట‌.

అది చూసి ఇంప్రెస్ అయిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌.. మ‌రోవైపు మ‌ల‌యాళంలో దృశ్యం-3 కూడా ప‌ట్టాలెక్కుతున్న నేప‌థ్యంలో అదే స‌మ‌యంలో హిందీలో వేరుగా దృశ్యం-3 చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. దృశ్యం, దృశ్యం-2 చిత్రాల‌కు జీతు స్క్రిప్టు మీదే ఆధార‌ప‌డ్డ అజ‌య్-అభిషేక్.. ఇప్పుడు సొంత క‌థ‌తో ముందుకు వెళ్తుండ‌డం విశేష‌మే.

ఐతే జీతులా వీళ్లు ప‌క్డ‌బందీ థ్రిల్ల‌ర్ తీయ‌గ‌ల‌రా అన్న‌ది సందేహం. దృశ్యంకు ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో దృశ్యం-2 తీసి వావ్ అనిపించాడు జీతు. ఇప్పుడు దృశ్యం-3 కూడా అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌ని విధంగా ఉంటుంద‌నే అంచ‌నాలున్నాయి. మ‌ల‌యాళ దృశ్యం-3 ఈ ఏడాది చివ‌ర్లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. మ‌రి హిందీ వెర్ష‌న్ ఎప్పుడు రెడీ అవుతుందో చూడాలి.

This post was last modified on February 24, 2025 2:08 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Drishyam 3

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

47 seconds ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

41 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

1 hour ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago