ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందిన చావా బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. స్త్రీ 2, పుష్ప 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు చూస్తున్న పంపిణీదారుల ఆనందం అంతా ఇంతా కాదు. కేవలం ఉత్తరాదిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ చావా వసూళ్లు గణనీయంగా పెరిగాయి. మొదటి వారం నాలుగైదు షోలు మాత్రమే ఇచ్చిన జిల్లా కేంద్రాలు వాటిని పదికి పెంచాయి. కొత్త రిలీజులు ఏమంత ఆసక్తికరంగా లేకపోవడంతో చావాకు తగినన్ని స్క్రీన్లు దొరికేందుకు మార్గం సుగమం అయ్యింది. ముఖ్యంగా ఈవెనింగ్, నైట్ షోలు మంచి ఆక్యుపెన్సీలు చూపిస్తున్నాయి.
పది రోజులకు చావా 300 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టేసింది. నిన్న బుక్ మై షోలో సగటున గంటకు 50 వేల దాకా టికెట్లు అమ్ముడుపోవడం వీకెండ్ క్రేజ్ కి నిదర్శనం. ఈ ప్రభంజనం ఎప్పటిదాకా ఉంటుందంటే ఇంకో రెండు వారాలు కనిష్టంగా ఈ జోరు ఇలాగే కొనసాగడం ఖాయం. చూస్తుంటే అయిదు వందల కోట్ల మార్కు కష్టమేమి కాదు. సులభంగానే చేరుకుంటుంది. ఎలాగూ ఓటిటి రిలీజ్ మల్టీప్లెక్సుల నిబంధనల ప్రకారం యాభై రోజుల తర్వాతే కాబట్టి థియేటర్ రన్ కొచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే గేమ్ ఛేంజర్, తండేల్ లాగే ఇది కూడా హెచ్డి పైరసీ బారిన పడటం కలెక్షన్ల మీద ప్రభావమైతే చూపిస్తోంది.
దీని పుణ్యమాని విక్కీ కౌశల్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఖాన్ల ద్వయం తర్వాత స్టార్లుగా అవతరిస్తున్న వాళ్లలో రన్బీర్ కపూర్ మొదటి పేరుగా కాగా ఇప్పుడీ టాప్ వన్ లీగ్ లోకి విక్కీ దాదాపు చేరిపోయినట్టే. ఎక్కడికి వెళ్లినా జనాలు నీరాజనాలు పడుతున్నారు. చావా ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే పలు నగరాల్లో అక్బర్ బాబర్ అని మొఘల్ రాజుల పేర్లున్న వీధుల బోర్డులను జనాలు మార్చేస్తున్నారు. ఆ వీడియోలు వైరలవుతున్నాయి. రష్మిక మందన్న సైతం చావాతో హ్యాట్రిక్ హిట్లను పూర్తి చేసుకుని డిమాండ్ పెంచేసుకుంది. తెలుగుతో పాటు ఇతర బాషల డబ్బింగ్ సూచనలు దాదాపు కనుమరుగైనట్టే.
This post was last modified on February 23, 2025 12:27 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…