మొన్నటిదాకా మీడియం రేంజ్ లో ఉంటూ తక్కువ బడ్జెట్ సినిమాలతో సర్దుకుంటూ వచ్చిన ఉన్ని ముకుందన్ మార్కో పుణ్యమాని ఒక్కసారిగా ప్యాన్ ఇండియా లీగ్ లోకి వచ్చేశాడు. ఆ మూవీ హిందీలోనూ బాగా ఆడటమే కాక అన్ని భాషలు కలిపి వంద కోట్ల గ్రాస్ సాధించడం మార్కెట్ ని పెంచింది. ఇతని తాజాగా చిత్రం గెట్ సెట్ బేబీ శుక్రవారం రిలీజయ్యింది. మార్కోకి పూర్తి భిన్నమైన కంటెంట్ తో ఇది రూపొందింది. ఈ సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనో స్టేట్ మెంట్ ఇచ్చాడు. తాను ఎప్పుడు ముద్దు, శృంగార సన్నివేశాలకు దూరం ఉంటానని, దర్శకులు అడిగినా మొహమాటం లేకుండా నో చెప్పేస్తానని అన్నాడు.
సరే మంచి విషయమే. పిల్లల మీద ప్రభావం చూపించే ఇలాంటివి చేయనని చెప్పడం ఒక యాక్టర్ పరిణితిని సూచిస్తుంది. మరి బోల్డ్ సీన్స్ కన్నా ప్రమాదకరమైన వయొలెన్స్ మార్కోలో చేసినప్పుడు వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఉన్ని ముకుందన్ ఆలోచించలేదేమో. చిన్న పిల్లలను, గర్భిణీ స్త్రీని వర్ణించలేనంత దారుణంగా ఎలా చంపొచ్చో చూపించిన తీరు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భయపెట్టేశారు. ఒకవేళ దానికి క్రియేటివ్ ఫ్రీడమ్, సహజత్వం అని పేరు పెడితే ముద్దు సీన్లను కూడా అలాగే అంగీకరించవచ్చుగా. ఉదాహరణకు గీతాంజలిలో నాగార్జున, గిరిజ లిప్ లాక్ ని ఎవరూ ఇంటిమసీ అనరు.
పైపెచ్చు జనాల మీద రొమాన్స్ కన్నా వయొలెన్స్ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. వెబ్ సిరీస్ లు చూసి హత్యలు చేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. సినిమాలు చూసి దొంగతనాలు నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమకథలు చూసి లవ్ లో పడే యువత ఉన్నట్టే మితిమీరిన హింస వల్ల ప్రేరేపింపబడి దారుణాలు చేసే నేరస్థులు లేకపోలేదు. సరే ఉన్ని ముకుందన్ అన్నది తప్పని చెప్పడం కాదు కానీ తనలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరో మార్కో లాంటివి చేసినప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి కదానేది విశ్లేషకుల అభిప్రాయం. అన్నట్టు మార్కో 2 స్క్రిప్ట్ రెడీ అవుతోంది. ఈసారి డబుల్ డోస్ ఉంటుందట.
This post was last modified on February 22, 2025 7:24 am
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…