పదమూడు సంవత్సరాల క్రితం 2012లో వచ్చిన గజిని సూర్య కెరీర్ ని గొప్ప మలుపు తిప్పడమే కాక దర్శకుడు ఏఆర్ మురుగదాస్ పేరు జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అమీర్ ఖాన్ వెంటపడి మరీ ఆయనతోనే రీమేక్ చేసి వంద కోట్ల గ్రాసర్ సాధించాడంటే చిన్న విషయం కాదు. ఆ తర్వాత తుపాకీ, కత్తి మాత్రమే మురుగదాస్ స్థాయిలో కంటెంట్ ఉన్న సినిమాలు.
సర్కార్ నుంచి పూర్తి ట్రాక్ తప్పేశారు. స్పైడర్ దారుణంగా నిరాశపరచగా దర్బార్ రజనీకాంత్ రేంజులో ఆడలేకపోయింది. అయినా సరే కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథను నమ్మి సికందర్ ఛాన్స్ ఇచ్చాడు. రంజాన్ విడుదల లక్ష్యంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదింకా థియేటర్లకు రాకుండా మురుగదాస్ శివ కార్తికేయన్ కలయికలో రూపొందుతున్న మదరాసి టీజర్ ఇవాళ వచ్చేసింది. విజువల్స్ చూస్తే తుపాకీ నాటి వింటేజ్ నెస్ కనిపిస్తోంది. యాక్షన్ బ్లాక్స్, టెర్రరిజం మాఫియా బ్యాక్ డ్రాప్ వగైరాలతో మరోసారి స్క్రీన్ ప్లే మేజిక్ చేసేలా కనిపిస్తున్నాడు.
ఎప్పటిలాగే అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాంచి ఎలివేషన్ ఇచ్చింది. నిజానికిది అమరన్ కన్నా ముందు కమిటైన సినిమా. మొదలుపెట్టాక సల్మాన్ నుంచి పిలుపు రావడంతో దాస్ అటువైపు వెళ్లారు. ఇప్పుడు మదరాసి మీద ఫోకస్ పెడుతున్నారు. చూస్తుంటే సీనియర్ దర్శకుడి మాములు స్పీడ్ గా లేదు.
ఇవి కనక హిట్ అయితే మురుగదాస్ పూర్తి ఫామ్ లోకి వచ్చేసినట్టే. తిరిగి స్టార్ హీరోలతో కాంబోలు కుదురుతాయి. కొన్నేళ్లుగా టయర్ 1 స్టార్ హీరోలు ఈయన్ని దూరంగా ఉంచుతున్నారు. పుష్ప టైంలోనే అల్లు అర్జున్ కలయికలో ఒక భారీ చిత్రం తీయాలని జ్ఞానవేల్ రాజా అనుకున్నారు కానీ సాధ్యపడలేదు.
తర్వాత తమిళ తెలుగు హీరోలను మురుగదాస్ కలిసినా లాభం లేకపోయింది. ఇప్పుడు సరైన టైం వచ్చింది. సికందర్, మదరాసి కనక వర్కౌట్ అయితే డిమాండ్ అమాంతం పెరుగుతుంది. కథలకు లోటు లేకుండా బోలెడు సిద్ధం చేసి పెట్టుకున్న దాస్ ఈ రెండు సినిమాల మీద మీద బోలెడు నమ్మకంతో ఉన్నారు.
This post was last modified on February 17, 2025 4:47 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…