నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘డాకు మహారాజ్’ విడుదలకు ముందు అందులోంచి రిలీజ్ చేసిన ‘దబిడి దిబిడి’ పాట విషయంలో సోషల్ మీడియా వేదికగా ఎంత ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఆ పాటలో నర్తించిన ఊర్వశి రౌటెలా జఘన భాగంలో కొడుతూ బాలయ్య వేసిన స్టెప్స్ చాలామందికి అభ్యంతరకరంగా అనిపించాయి. ఆ పాట రిలీజ్ చేయడం ఆలస్యం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
బాలయ్యతో పాటు డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్‌ను చాలామంది ట్రోల్ చేశారు. ఈ ట్రోల్ మెసేజ్‌లన స్వయంగా ఊర్వశి రౌటెలానే సోషల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం చర్చనీయాంశం అయింది. అది ట్రోలింగ్ అని తెలియక ఆమె షేర్ చేసినట్లుగా టీం తర్వాత ఏదో కవర్ చేసింది. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ఊర్వశి నేరుగా ఆ ట్రోలింగ్ గురించి స్పందించింది.
‘దబిడి దిబిడి’ పాట చిత్రీకరిస్తున్నపుడు కానీ, రిహార్సల్స్ చేస్తున్నపుడు కూడా ఆ స్టెప్స్‌లో తమకు అసభ్యకరంగా ఏమీ అనిపించలేదని ఊర్వశి తెలిపింది. సోషల్ మీడియాలో ఈ పాటపై ట్రోల్స్ రావడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘ఈ పాట కోసం ముందే రిహార్సల్స్ చేశాం. అది ప్రశాంతంగా సాగింది. అన్ని పాటలకు కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో దానికీ అలాగే చేశాం. శేఖర్ మాస్టర్‌తో అంతకుముందే మూడు పాటలకు పని చేశాను.
ఆయన స్టెప్స్ గురించి చెప్పినపుడు నాకు ఏమాత్రం ఇబ్బందికరంగా అనిపించలేదు. మామూలు స్టెప్స్‌లాగే భావించా. కానీ పాట రిలీజయ్యాక సోషల్ మీడియా వచ్చిన ట్రోల్స్ చూసి షాకయ్యా. కొరియోగ్రఫీని ప్రేక్షకులు తప్పుబట్టడానికి కారణమేంటో అంచనా వేయడానికి కూడా టైం లేకపోయింది. రిహార్సల్స్ టైంలో మేం ఇలాంటి విమర్శలు వస్తాయని అస్సలు ఊహించలేదు. మేం దానికి సంబంధించిన క్లిప్స్ రిలీజ్ చేసినపుడు మాత్రం ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు’’ అని ఊర్వశి తెలిపింది.
This post was last modified on February 12, 2025 5:03 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…