జవాన్ తో బాలీవుడ్ లో పెద్ద జెండా పాతేసిన దర్శకుడు అట్లీ నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే వచ్చింది. ప్రముఖంగా వినిపించిన పేర్లు రెండు. ఒకటి సల్మాన్ ఖాన్. రెండు అల్లు అర్జున్. చివరికి ఐకాన్ స్టార్ దే ఓకే అయ్యేలా ఉందని ముంబై రిపోర్ట్. దీని వెనుక చాలా మ్యాటరే నడిచిందట. అదేంటో చూద్దాం.
అట్లీ ముందు సల్మాన్ ని దృష్టిలో పెట్టుకునే ఒక పవర్ ఫుల్ కథని రాసుకున్నాడు. కానీ బడ్జెట్ 400 కోట్లకు పైగా కేవలం ప్రొడక్షన్ కే ఖర్చవుతుందని చెప్పడంతో ముందు చూద్దామన్న జియో స్టూడియోస్ వెనుకడుగు వేసిందట. అంత మొత్తం సల్మాన్ మీద వర్కౌట్ కాదనే ఉద్దేశంతో.
ఇదే ప్రతిపాదన సన్ పిక్చర్స్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు కూడా ఇదే సమాధానం వచ్చిందట. కండల వీరుడి మీద అంత రిస్క్ చేయలేమని చెప్పి పెండింగ్ లో ఉంచేశారు. ఒకవేళ అల్లు అర్జున్ అయితే కనక ఎంత బడ్జెట్ అయినా సరే రెడీ అనే సంకేతం ఇవ్వడంతో ఆ మేరకు ఐకాన్ స్టార్ తో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్యాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్న బన్నీ ఒకవేళ అది మరీ ఆలస్యమయ్యే పక్షంలో అట్లీకు ఎస్ చెప్పొచ్చు. లెక్కలు వేసుకోకుండా మరీ పెట్టుబడి పెట్టేందుకు సన్ సిద్ధపడిందంటే అదంతా పుష్ప మహాత్యమే.
ఇదంతా అధికారిక ముద్ర వేసుకునేందుకు కొంత టైం పట్టేలా ఉంది కానీ మొత్తానికి లాక్ అవ్వడం ఖరారేనని టాక్. దీన్ని బట్టి టాలీవుడ్ స్థాయి బాలీవుడ్ ని మించి ఎంత ఎత్తుకు ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అలాని సల్మాన్ – అట్లీ కాంబో ఉండదని కాదు. వేరే స్టోరీతో అంత బడ్జెట్ డిమాండ్ చేయని విధంగా మరో ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఏది ముందు ఏది వెనక్కు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి. బన్నీ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు కొత్త సినిమా మొదలవుతుందాని ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 ది రూల్ రిలీజై ఇప్పటికే రెండు నెలలు దాటిపోయింది. ఇంకా కొత్త ప్రకటనైతే రాలేదు.
This post was last modified on February 12, 2025 12:36 pm
సెన్సార్ బోర్డు ఏదైనా సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చిందంటే అది కేవలం పెద్దలకు ఉద్దేశించినది మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే.…
నిన్న జరిగిన తండేల్ సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ విజయాలకు…
ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి…
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…