విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ ఆ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద డిజాస్టర్లలో నిలిచింది. ఈ సినిమాతో చాలామంది కెరీర్లకు గట్టి దెబ్బ తగిలింది. ఈ మూవీతోనే దక్షిణాదిన అడుగుపెట్టిన కథానాయికగా వెలిగిపోవాలని అనుకున్న బాలీవుడ్ భామ అనన్య పాండేకు పెద్ద షాక్ తగిలింది.
ఓవైపు సినిమా డిజాస్టర్ అయితే.. ఇంకోవైపు తన పాత్ర, పెర్ఫామెన్స్ విషయంలోనూ తీవ్ర విమర్శలు తప్పలేదు. ఐతే తన పాత్ర గురించి చెప్పినపుడే ఈ సినిమాలో చేయాలా వద్దా అని సంశయించిందట అనన్య. ఈ విషయాన్ని తండ్రి దగ్గర కూడా చెప్పిందట. కానీ తనే ఆమెను బలవంతంగా ఒప్పించి ఈ సినిమా చేయించినట్లు ‘లైగర్’లో అనన్య తండ్రి చుంకీ పాండే వెల్లడించాడు. ‘లైగర్’లో చుంకీ కూడా నటించిన సంగతి తెలిసిందే.
‘‘అనన్యకు లైగర్ సినిమాలో అవకాశం వచ్చినపుడు తనెంతో అసౌకర్యంగా ఫీలైంది. గందరగోళానికి గురైంది. తాను అందులో హీరోయిన్ పాత్రకు సెట్ కానని, చిన్న పిల్లలా కనిపిస్తానని తను అనుకుంది. నా దగ్గరికి వచ్చి.. ఈ సినిమాకు తాను సెట్ కాననిపిస్తోందని, ఏం చేయమంటావని అడిగింది. కానీ అలా ఆలోచించవద్దని, అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, సక్సెస్ అయితే బాగా పేరొస్తుందని చెప్పి నేనే ఆ సినిమాకు ఒప్పించా. కానీ లైగర్ రిలీజయ్యాక వచ్చిన రివ్యూలు చూసి ఆమె చెప్పిందే నిజమని అనిపించింది.
నిజంగానే ఆ సినిమాలో అనన్య చేసిన పాత్రకు సూట్ కాలేదు. చిన్నమ్మాయిలా అనిపించింది. ఆ సినిమా తర్వాత నేనెప్పుడూ తనకు సలహాలు ఇవ్వలేదు. తన సినిమాల విషయంలో నిర్ణయాలు తనకే వదిలేశాను. ప్రస్తుతం అనన్యకు నచ్చే, నప్పే సినిమాలు ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతోంది’’ అని చుంకీ పాండే తెలిపాడు. ‘లైగర్’లో చుంకీ పాండే.. అన్య తండ్రి పాత్రనే పోషించిన సంగతి తెలిసిందే.
This post was last modified on February 6, 2025 3:23 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…