బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే అయినా పడిన చోటే లేవాలనే సూత్రంతో మహానటి అడుగులు గట్టిగానే పడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ నిర్మించిన అక్కలో తను టైటిల్ రోల్ పోషించింది. అయితే ఇదేదో ఆషామాషీ కంటెంట్ తో వస్తున్న రెగ్యులర్ హిందీ సినిమా కాదు.
బోలెడు కసరత్తు జరిగింది. అదేంటో చూద్దాం. సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలింస్ లో దర్శకుడిగా అవకాశం దక్కించుకోవాలంటే చిన్న విషయం కాదు. ఆదిత్య చోప్రాని ఒప్పించి మెప్పించడం కన్నా ఆస్కార్ తెచ్చుకోవడం ఈజీ అంటారు తెలిసినవాళ్ళు. అంత కఠినంగా ఉంటుంది సెలక్షన్.
అక్క దర్శకుడు ధర్మ రాజ్ శెట్టి. 2023 సంవత్సరంలో దీని స్క్రిప్ట్ ని ఓకే చేయించుకున్నాడు. నెరేషన్ వినగానే థ్రిల్ అయిన ఆదిత్య చోప్రా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బేబీ జాన్ కన్నా ముందే కీర్తి సురేష్ సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. పీరియాడిక్ డ్రామాగా ప్రతీకార నేపథ్యంలో సాగుతుంది.
తనకు అన్యాయం చేసిన అక్కాస్ అనే గ్యాంగ్ మీద ఒక అమ్మాయి తీర్చుకునే రివెంజ్ ఆధారంగా దీన్ని రూపొందించారు. టీజర్ లో చూపించింది కేవలం శాంపిల్స్ మాత్రమే. కంటెంట్ చాలా షాకింగ్ ఉంటుందని టాక్. కీర్తి సురేష్ ఇందులో బోల్డ్ గా నటించినట్టు ఆమె వస్త్రధారణ చెప్పకనే చెబుతోంది.
సో హిందీలో జెండా పాఠాలని చూస్తున్న కీర్తి సురేష్ కు అక్క మంచి బ్రేక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బేబీ జాన్ లో చేసింది చనిపోయే హీరోయిన్ పాత్ర కావడం వల్ల అంత గుర్తింపు రాలేదు. పైగా తేరి రీమేక్ అవ్వడం ఫలితం మీద తీవ్ర ప్రభావం చూపించింది.
గతంలో చిన్ని, మిస్ ఇండియా, పెంగ్విన్ లాంటి ఓటిటి మూవీస్ చేసిన కీర్తి సురేష్ కు ఇప్పుడీ అక్క వాటికి మూడు నాలుగింతలు పెద్ద బడ్జెట్ తో రూపొందింది. రాధికా ఆప్టే తనతో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. పేరేమో అక్క అని ఉంది కానీ ఆమె చేయబోయే హింస మాత్రం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుందట. చూద్దాం.
This post was last modified on February 3, 2025 9:50 pm
మలయాళంలో గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన సినిమా ‘మార్కో’. జనతా…
సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్ కోసం టాలీవుడ్ బాగానే…
విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…
ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…