మొన్నటి ఏడాది వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ బాహుబలి రేంజ్ లో కాకపోయినా బ్లాక్ బస్టర్ వసూళ్లతో సూపర్ సక్సెస్ అందుకుంది. వసూళ్ల రేంజ్ పక్కనపెడితే హాట్ స్టార్ లో హిందీ వెర్షన్ మూడు వందల రోజులకు పైగా టాప్ ట్రెండింగ్ లో ఉండటం క్రేజ్ కి నిదర్శనం.
అయితే మొదటి భాగంలో చాలా ప్రశ్నలు వధిలేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ వాటికి సమాధానాలు సీక్వెల్ లో చెబుతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాకపోతే సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం షూటింగ్ ఎప్పటి నుంచి అనేది క్లారిటీ లేకపోయింది. దీనికి పృథ్విరాజ్ సుకుమారన్ తెరదించేశారు. కాకపోతే ఇక్కడ కొన్ని అంశాలున్నాయి.
ఆయన చెప్పింది తెలిసిన విషయమే, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా మూవీ అయ్యాకే సలార్ 2 మొదలవుతుంది. కానీ ప్రాక్టికల్ గా చూడాల్సింది ఏంటంటే తారక్ సినిమా అంత వేగంగా పూర్తయ్యే వ్యవహారం కాదు. 2026 సంక్రాంతికి పేరుకి లాక్ చేశారు కానీ రావడం అనుమానంగానే ఉంది.
ఎందుకంటే అంత పెద్ద గ్రాండియర్ ని కేవలం 11 నెలల్లో పూర్తి చేయడం సులభం కాదు. ఇంత వ్యవధిలోనే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు అన్నీ చూసుకోవాలి. పైగా 2025లో వార్ 2 కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇంకా డేట్లు ఇవ్వాల్సింది ఉంది. జూలై నుంచి దాని పబ్లిసిటీలో భాగం కావాలి.
సో నీల్ బొమ్మకు ఆ టైంలో బ్రేకులు పడతాయి. ఎలా చూసుకున్నా ఏడాదిన్నరకు పైగానే సమయం పడుతుంది. అదే జరిగిన పక్షంలో సలార్ 2026 మధ్యలో మొదలుపెడితే 2027లో రిలీజ్ చేయొచ్చు. లేదూ పర్ఫెక్షన్ కోసం తాపత్రయపడే ప్రశాంత్ నీల్ రాజీ పడకపోతే ఇంకో ఏడాది అదనంగా అవుతుంది.
సో సలార్ 2 గురించి ఇప్పుడప్పుడే ఎదురు చూడటం మానేస్తే బెటర్. పృథ్విరాజ్ ఈ మాట నేరు అనకపోయినా విశ్లేషించుకుంటే వచ్చే అర్థం అదే. ఇంకా ఆరిస్టుల డేట్లు తీసుకోలేదు. ముందంటూ షూటింగ్ గురించి ఒక మాట అనుకుంటే అప్పుడు కాల్ షీట్ల వ్యవహారం చూస్తారు. అప్పటిదాకా వెయిటింగే.
This post was last modified on January 30, 2025 9:39 am
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…