నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. దశాబ్దాలుగా కంటున్న కల నిజమయ్యింది. బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బాలయ్య ఈ పురస్కారం అందుకోవడం ఫ్యాన్స్ కి చిరకాల జ్ఞాపకంగా నిలిచిపోనుంది. కళల విభాగంలో తెలుగు రాష్ట్రాల నుంచి పద్మభూషణ్ బాలకృష్ణ అందుకోనుండగా తమిళనాడు నుంచి అజిత్ కు అర్హత దక్కింది. ఇద్దరూ అగ్ర హీరోలే కావడం విశేషం.
తాతమ్మ కలతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించాక తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయనతో పాటు తెరను పంచుకుని ఆరితేరారు. సోలో హీరోగా 1984 లో సాహసమే జీవితంతో కెరీర్ మొదలుపెట్టారు. తొలి ఇండస్ట్రీ బ్రేక్ మంగమ్మ గారి మనవడుతో అందుకున్నాక వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
ముద్దుల మావయ్యతో మహిళా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాక లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్ లాంటి చిత్రాలు మాస్ లో బలమైన ఫాలోయింగ్ పెంచాయి. స్టార్ హీరోగా పీక్స్ చూస్తున్న టైంలోనే టాలీవుడ్ తొలి సైన్స్ ఫిక్షన్ ఆదిత్య 369 చేసిన ఘనత బాలకృష్ణకే దక్కింది.
ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సమరసింహారెడ్డి చేసి పరిశ్రమకో కొత్త జానర్ ను పరిచయం చేసిన బాలయ్య వందకు పైగా సినిమాలతో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఫ్లాపులు పలకరిస్తున్న టైంలో సింహతో కంబ్యాక్ ఇచ్చి రికార్డుల వేట మొదలుపెట్టడం ఎవరూ మర్చిపోలేరు. తాజాగా డాకు మహారాజ్ తో వరసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ తో ఆరు పదుల వయసులోనూ దూకుడు మీదున్న బాలకృష్ణ హిందుపూర్ ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఎంపికై అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు.
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది రోగులకు జీవదానం చేస్తూ బుల్లితెరపై అన్ స్టాపబుల్ గా దూసుకుపోవడం ఆయనకే చెల్లింది. కళాకారులు ఆభరణంగా భావించే పద్మభూషణ్ బాలకృష్ణ కిరీటంలో చేరడం సినీ ప్రియులను ఆనందంలో ముంచెత్తుతోంది.
This post was last modified on January 25, 2025 9:58 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…