ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది. అప్పటిదాకా హిందీలో పెద్దగా గుర్తింపు లేని జెడి చక్రవర్తికి ఇమేజ్ తేవడంతో పాటు మనోజ్ బాజ్ పాయ్ ని ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది.
ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాని చాలా ఇంటెన్స్ తో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీర్చిదిద్దిన విధానం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. సత్యని ఇన్స్ పిరేషన్ గా తీసుకుని ఎన్ని సినిమాలు తీశారో లెక్కబెట్టడం కష్టం. అంతకు ముందు గాడ్ ఫాదర్, నాయకుడు లాంటి చిత్రాల గురించి చెప్పుకునేవారు సత్య పేరుని వాటి సరసన జోడించారు.
అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత సత్య మళ్ళీ థియేటర్లలో చూసే అవకాశం దక్కడం పట్ల మూవీ లవర్స్ సంతోషం వ్యక్తం చేశారు. రీ మాస్టర్ చేసిన కొత్త ప్రింట్ తో గతంలో చూడని అనుభూతిని పొందారు. ఇది స్వయానా రామ్ గోపాల్ వర్మనే కదిలించింది.
ఈ సినిమా తీసే టైంలో ఉన్న నిజాయితీ ఇప్పుడు కొరవడిందని, షో చూసి ఇంటికొచ్చాక ఒకరకమైన శూన్యం, కన్నీళ్లు తనను ఆవహించాయని, ఇకపై మేల్కొని తనలో రియల్ ఫిలిం మేకర్ ని బయటికి తీసుకొస్తానని సుదీర్ఘమైన పోస్టుని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంటే సత్య జ్ఞానోదయం రామ్ గోపాల్ వర్మ మీద బలంగా పని చేసిందన్న మాట.
సినీ ప్రియులు కోరుకుంటున్నది ఇదే. ఒకప్పుడు శివ, క్షణక్షణం, రంగీలా, కంపెనీ, భూత్ లాంటి లైబ్రరి సినిమాలు తీసిన వర్మ మొన్నటి ఎన్నికల వరకు ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఏదేదో సినిమాలు తీయడం ఫ్యాన్స్ ని బాధ పెట్టింది. అవసరం లేని వివాదాల మీద చిత్రాలు తీసి సొమ్ము చేసుకోవాలనుకోవడం మిస్ ఫైర్ అయ్యింది.
మరీ సత్య రేంజ్ లో కాకపోయినా కనీసం ఇది చూడొచ్చు అని అందరూ అనుకునేలా ఏదైనా తీయాలని అభిమానుల కోరిక. అయినా వర్మని గెస్ చేయలేం. ఇప్పుడు చూపించిన జ్ఞానోదయం నిజమైతే సంతోషమే కానీ ఓ రెండు రోజులయ్యాక తూచ్ అన్నా ఆశ్చర్యపోవడానికి ఏమి లేదు.
This post was last modified on January 20, 2025 12:10 pm
బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదగడం అంత తేలికైన విషయం కాదు. ఎంతో ప్రతిభ ఉండాలి.…
ఒక టైంలో నిలకడగా హిట్లు కొడుతూ మంచి ఊపులో కనిపించాడు యువ కథానాయకుడు విశ్వక్సేన్. కానీ కొన్నేళ్లుగా అతడికి విజయాలు…
రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి అనూహ్యంగా తెలుగు వారి…
నోట్ల రద్దు తర్వాత సడన్ గా వచ్చిన రూ.2000 నోట్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు గడువు…
నిన్న సూర్య రెట్రోతో పాటు తమిళంలో టూరిస్ట్ ఫ్యామిలీ విడుదలయ్యింది. తెలుగు డబ్బింగ్ చేయలేదు కానీ కోలీవుడ్ లో దీని…