తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్‌కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ టైంలో టాక్ బాగుంటే మామూలు రోజుల్లో కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయి. అదే సమయంలో పోటీ ఎక్కువ ఉండడం వల్ల టాక్ బాలేని సినిమాలకు గట్టి దెబ్బ కూడా పడుతుంటుంది. ఈసారి ఆ దెబ్బ గేమ్ చేంజర్ మీద పడింది. సంక్రాంతి రేసులో ముందుగా వచ్చిన ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ వరకు పర్వాలేదనిపించినా.. తర్వాత సినిమా తడబడుతూ సాగుతోంది. ఆక్యుపెన్సీలు అంతంతమాత్రంగా ఉన్నాయి. ఈ సినిమా మీద భారీ పెట్టుబడులు పెట్టిన నిర్మాత, బయ్యర్లకు ఇబ్బందులు తప్పలేదు. కానీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజే.. సంక్రాంతికి వస్తున్నాంను కూడా ప్రొడ్యూస్ చేశారు. తన రెగ్యులర్ బయ్యర్లకే ఈ సినిమాను కూడా అందించారు. దీంతో గేమ్ చేంజర్‌తో పడ్డ డెంట్‌ను సంక్రాంతికి వస్తున్నాం కవర్ చేస్తోంది.
యుఎస్ లాంటి చోట్ల మాత్రమే గేమ్ చేంజర్‌కు మరీ ఎక్కువ నష్టాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాతో వస్తున్న నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం ద్వారా వస్తున్న లాభాలు చాలా వరకు భర్తీ చేసేస్తున్నాయి. రెండు సినిమాలకు వేర్వేరు బయ్యర్లు ఉన్న చోట దిల్ రాజు నష్టాల భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇబ్బంది లేదు. మరోవైపు డాకు మహారాజ్ సినిమా నిర్మాత, బయ్యర్లకు మంచి లాభాలను అందిస్తోంది. ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజే నైజాం ఏరియాలో డిస్ట్రబ్యూట్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ మూవీ ద్వారా కూడా ఆయనకు మంచి లాభాలు రానున్నాయి. కాబట్టి గేమ్ చేంజర్ నష్టాల భర్తీకి ఇది కూడా ఉపయోగపడుతుంది.
కాబట్టి ఓవరాల్‌గా ఆయన బ్యాలెన్స్ షీట్ చాలా బెటర్‌గానే ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే గేమ్ చేంజర్ ఫలితం విషయంలో హీరో, డైరెక్టర్ ఫీలవ్వాలి కానీ.. దాని మీద డబ్బులు పెట్టిన నిర్మాత మాత్రం సేఫే. ఇక మిగతా రెండు సంక్రాంతి చిత్రాల్లో భాగమైన అందరూ ఫుల్ ఖుషీ అన్నట్లే. కాబట్టి ఓవరాల్‌గా 2025 సంక్రాంతికి ఆల్ హ్యాపీస్ అన్నట్లే.
This post was last modified on January 18, 2025 12:04 pm
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…
ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో…
టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు…
వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు నిత్యం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై సెటైర్ల మీద సెటైర్లు వేసే వారు.…
ఈ రోజుల్లో ఓ సినిమా విడుదలైన 4 రోజుల తర్వాత కూడా థియేట్రికల్ రన్ కొనసాగించడం అంటే అరుదైన విషయమే.…