ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో ఇప్పుడు భీమ్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాడు. పండగ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాంకి అతను ఇచ్చింది మూడు పాటలే.
వాటిలో గోదారి గట్టు మీద చందమామవే ఏకంగా ఓపెనింగ్స్ లో సింహ భాగం పోషించే రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యింది. తమన్ కంపోజ్ చేసిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పాటల కన్నా వేగంగా వంద మిలియన్ల క్లబ్బులో చేరింది భీమ్స్ సాంగ్సే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగానూ ఇతని మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని లక్షల రీల్స్ ఈ పాటల మీద వచ్చాయి.
మాములుగా ఆడియో కంపెనీలు ఏదైనా బడా మూవీ హక్కులు కొనేటప్పుడు ఎన్ని పాటలు ఉన్నాయనేది ముందు చూసుకుంటారు. దాన్ని బట్టే రేట్ ఉంటుంది. ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని వ్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ అనిల్ రావిపూడి దానికి కట్టుబడకుండా కేవలం కథ డిమాండ్ కు అనుగుణంగా మూడుతోనే సరిపుచ్చాడు.
కాకపోతే అవి బెస్ట్ కావాలని భీమ్స్ తో కో ఆర్డినేట్ చేసుకుని 2025 బెస్ట్ ఆల్బమ్ అయ్యే రేంజ్ లో వర్క్ చేయించుకున్నాడు. దాని ఫలితమే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. పాటలు బాగున్నాయి కాబట్టి సినిమా బాగుంటుందనే ఫీలింగ్ రిలీజ్ కు ముందే వచ్చేసింది.
మ్యూజిక్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పేందుకు ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. వందల కోట్ల బడ్జెట్ పెట్టినా కొన్నిసార్లు కేవలం పాటల వల్లే బజ్ హెచ్చుతగ్గులకు గురైన సందర్భాలు ఎన్నో. తమన్, దేవిశ్రీప్రసాద్ ఎందుకో తమ మేజిక్ ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకోలేకపోతున్న టైంలో భీమ్స్ ఇలా దూసుకురావడం శుభ పరిణామం.
చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు కూడా ఇతన్నే తీసుకున్నారనే లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. ఇది నిజమైతే మెగా జాక్ పాట్ తగిలినట్టే. పోకిరిలో మహేష్ స్టైల్ లో చెప్పాలంటే పాటలు ఎన్ని ఇచ్చామనేది కాదు, ఇచ్చినవి అదిరిపోయాయా లేదా. సంక్రాంతికి వస్తున్నాంకు జరిగింది ఇదే.
This post was last modified on January 18, 2025 10:35 am
మొన్న డిసెంబర్ 25 విడుదల కావాల్సిన నితిన్ రాబిన్ హుడ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తీసుకొచ్చే ఆలోచన…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…
టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు…