సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు పూర్తి చేసిన వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబో ఇకపై వస్తూనే ఉంటుందట. కనీసం 8 నుంచి 10 సినిమాలు తమ కలయికలో రావొచ్చని దర్శకుడే స్వయంగా చెప్పడం చూస్తే ఈ ఇద్దరి మధ్య కంటెంట్ కెమిస్ట్రీ ఏ స్థాయిలో వర్కౌటవుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఎఫ్2 నుంచి ఈ కలయికకు శ్రీకారం చుట్టింది నిర్మాత దిల్ రాజే. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు, పేట పోటీని తట్టుకుని సాధించిన బ్లాక్ బస్టర్ ని ఫ్యాన్స్ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎఫ్3 సైతం మంచి విజయం నమోదు చేసుకుని జనాలకు నవ్వులు, ప్రొడ్యూసర్ కు కాసులు పంచింది.
ఇప్పుడు వాటిని మించేలా సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల భరతం పడుతోంది. కేవలం రెండు రోజులకే డెబ్భై ఏడు కోట్ల గ్రాస్ తేవడం చూసి ట్రేడ్ కి నోటమాట రావడం లేదు. ఇప్పుడూ విపరీతమైన కాంపిటీషన్ ఉంది. అయినా సరే వాటిని తోసిరాజని విన్నర్ గా నిలుస్తోంది.
వెంకీతో బాగా సింక్ అవుతున్న రావిపూడి ఆయన బాడీ లాంగ్వేజ్, టైమింగ్ కు తగ్గ కథలు, డైలాగులు రాసుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు అందుకున్నాడు. ఎప్పుడో విజయ్ భాస్కర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వెంకటేష్ నుంచి అవుట్ ఫుట్ రాబట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడినే అంటే ఒప్పుకోవాల్సిందే.
గతంలో ఇలాంటి కాంబోలు క్రేజీగా ఉండేవి. ఎన్టీఆర్ – రాఘవేంద్రరావు, చిరంజీవి – కోదండరామిరెడ్డి, బాలకృష్ణ – బి గోపాల్, ప్రభాస్ – రాజమౌళి ఇలా చాలా ఉదాహరణలున్నాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి వాటిని మించే స్థాయిలో వెంకటేష్ తో జట్టు కడతా అంటున్నారు.
ప్రస్తుతం చిరంజీవితో ప్రాజెక్టు ఓకే చేయించుకున్న ఈ క్రియేటివ్ కామెడీ డైరెక్టర్ చిరు ఒప్పుకోవాలే కానీ ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు రేంజ్ ఎంటర్ టైన్మెంట్ మాస్ చూపిస్తానని హామీ ఇస్తున్నారు. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సినిమా తనకు మరో పెద్ద బ్రేక్ అవ్వనుంది. స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ లాకవ్వగానే ప్రకటన వచ్చేస్తుంది.
This post was last modified on January 16, 2025 2:08 pm
హీరోలు ఆడవేషంలో కనిపించడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కానీ అది కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితమవుతుంది. చంటబ్బాయిలో చిరంజీవిని…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలలొ ఇప్పటి వరకు కొన్ని మాత్రమే అమలు చేసింది.…
ఒక్కోసారి ఎంత హిట్టు కొట్టినా ఆశించినంత పేరు రాకపోవడం నటీనటుల విషయంలో జరుగుతుందేమో కానీ దర్శకులకు అరుదు. కానీ సుందర్…
కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా…
పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ…
మలయాళం సినిమాలు ఈ మధ్య కాలంలో కంటెంట్ ఆధారంగా వచ్చి భాషతో సంబంధం లేకుండా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే…