టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే ఉంది. పెదనాన్న కృష్ణంరాజు గారు ఉన్నప్పుడే ఈ శుభకార్యం చేయాలని చూశారు కానీ అమ్మాయి దొరక్క వాయిదా పడుతూ వెళ్ళింది. ఈలోగా ఆయన కాలం చేయడం దురదృష్టం. బాహుబలితో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక డార్లింగ్ ఇంకా బిజీ అయిపోయాడు. ఇతర హీరోలు ఆచితూచి అడుగులు వేస్తూ రెండేళ్లకు ఒక సినిమా చేయడమే గగనంగా ఫీలవుతుంటే తను మాత్రం ఏకంగా రెండు సెట్స్ మీద ఉంచి మరో మూడింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంత వేగంగా పరుగులు పెడుతున్నాడు.
త్వరలోనే ప్రభాస్ ఇంటివాడు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ 4లో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రామ్ చరణ్, ప్రభాస్ ల మధ్యలో జరిగిన ఫోన్ సంభాషణ ద్వారా ఈ శుభవార్త బయటికి వచ్చేసిందిట. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంకు చెందిన అమ్మాయితో సంబంధం కుదిరిందని, త్వరలో ఈ కబురు అందరితో పంచుకుంటామని అన్నారట. అయితే పేరు, కుటుంబ వివరాలు ఏవీ చెప్పలేదు కానీ సస్పెన్స్ పూర్తిగా తీరలేదు. షోకు హాజరైన ప్రేక్షకుల ద్వారా ఈ లీక్ వచ్చింది కానీ ఎంతమేరకు నిజమో జనవరి 14 టెలికాస్ట్ అయ్యే రెండో ఎపిసోడ్ లో బయటపడుతుంది.
బాలయ్య, రామ్ చరణ్ ల మధ్య జరిగిన సరదా సంభాషణలు బాగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు రెండో భాగం కోసం ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లో చూపించిన అసలు కంటెంట్ ఇందులోనే ఉంది. ఒకవేళ ప్రభాస్ పెళ్లి కనక ఈ ఏడాదే ఉంటే సంబరం మాములుగా ఉండదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా సెలబ్రిటీలందరూ చేయబోయే సందడి చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఆతిధ్యానికి మారు పేరుగా చెప్పుకునే ప్రభాస్ ఇక తన పెళ్లికి ఎలాంటి విందు వినోదంతో ఉక్కిరిబిక్కిరి చేస్తాడో ఊహించుకోవడం కష్టం. ఆ శుభఘడియల కోసం ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులూ వెయిటింగ్.
This post was last modified on January 11, 2025 6:14 pm
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ…