మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల దృష్టిలో పడిపోయింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ డ్రామా ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) లో డార్లింగ్ జోడిగా ఈ అమ్మడుకి డెబ్యూనే ఇంత పెద్ద బ్రేక్ దక్కడం పట్ల ఆల్రెడీ ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా తన మీద బాలీవుడ్ మేకర్స్ కన్ను పడింది. నిజమో కాదో కానీ ఫౌజీ అయ్యే దాకా వేరే సినిమాలు ఒప్పుకోకూడదని మైత్రి సంస్థ అగ్రిమెంట్ చేసుకుందని గతంలో వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పుడు టి సిరీస్ అధినేతలు సంస్థ ఇమాన్వి కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు డైరెక్షన్ లో ఒక భారీ రొమాంటిక్ మూవీని ప్లాన్ చేశారు నిర్మాత భూషణ్ కుమార్. ఫౌజికి సైతం ఈయన నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సందీప్ వంగా – ప్రభాస్ స్పిరిట్ కి మెయిన్ ప్రొడ్యూసర్ కూడా. ఆదిపురుష్ కి ఎంత బడ్జెట్ పెట్టారో చూశాం. ఈ బాండింగ్ ని వాడుకుని ఇమాన్వి రెండో సినిమాని తమకు లాక్ చేయించేలా మాట్లాడుతున్నట్టు ముంబై రిపోర్ట్. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్న అనురాగ్ బసు సినిమాకు హీరోయిన్ ఎంపికే పెద్ద టాస్క్ అయ్యిందని సమాచారం.
ఏదో సామెత చెప్పినట్టు ఇమాన్వి నక్క తోక తొక్కింది. లేకపోతే ఎలా కనిపిస్తుందో, ఎలా నటిస్తుందో తెలియకుండానే ఇంత డిమాండ్ రావడమంటే మాములు విషయం కాదు. సోషల్ మీడియాలో తన రీల్స్, డాన్స్ చూసినవాళ్లకు పెర్ఫార్మన్స్ గురించి డౌట్లు లేవు కానీ ఫౌజీ లాంటి ప్యాన్ ఇండియా మూవీలో ఎలా కనిపిస్తుందనేది ఆసక్తికరం. పారితోషికం కూడా భారీగానే ముట్టజెబుతున్నారట. రష్మిక మందన్న, శ్రీలీల ఇలా రెండు మూడు ఆప్షన్లతోనే నెట్టుకొస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలకు భవిష్యత్తులో ఇమాన్వి ఇస్మాయిల్ మరో ఛాయస్ అవుతుందేమో చూడాలి. ఫౌజీ విడుదల 2026కి ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on January 8, 2025 5:37 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…