Movie News

అఖిల్ కోసం అదిరిపోయే విలన్

ఓ మంచి సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు అక్కినేని వారసుడు అఖిల్. విపరీతమైన హైప్ మధ్య రిలీజైన తన తొలి చిత్రం ‘అఖిల్’ డిజాస్టర్ కావడంతో అతడి కెరీర్‌కు పేలవ ఆరంభం లభించింది. రెండో చిత్రం ‘హలో’ మంచి టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టరే అయింది. మూడో చిత్రం ‘మిస్టర్ మజ్ను’తో కూడా లాభం లేకపోయింది. నాలుగో చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓ మోస్తరుగా ఆడినా.. తర్వాతి సినిమా ఏజెంట్ అల్ట్రా డిజాస్టర్ అయి అఖిల్‌ కెరీర్‌ను మళ్లీ కిందికి తీసుకెళ్లిపోయింది.

ఈ స్థితిలో యువి క్రియేషన్స్‌లో ఓ భారీ చిత్రానికి ప్లానింగ్ జరిగింది కానీ.. ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోవడం అక్కినేని అభిమానులను నిరాశకు గురి చేసింది. తర్వాత ఏంటి అని అనుకుంటుండగా.. మరోసారి అక్కినేని నాగార్జున రంగంలోకి దిగాడు. ‘హలో’ తర్వాత ఆయన మళ్లీ కొడుకు సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాడు.

కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణు కథ’ తీసి మెప్పించిన మురళీ కృష్ణ దర్శకత్వంలో అఖిల్ చేయబోతున్న సినిమాను నాగ్ నిర్మిస్తున్నాడు. ఇది ప్రేమకథ మిళితమైన థ్రిల్లర్ మూవీ అని సమాచారం. ఇందులో విలన్ పాత్రకు అదిరిపోయే ఛాయిస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. స్కామ్ 1992తో గొప్ప పేరు సంపాదించిన ప్రతీక్ గాంధీ ఇందులో ప్రతినాయక పాత్ర చేయబోతున్నాడట.

స్కామ్ 1992లో సటిల్ పెర్ఫామెన్స్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రతీక్. అతను తెలుగులో అరంగేట్రం చేయనుండడం పట్ల ఎగ్జైట్ అవుతున్నాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇంకా ఈ చిత్రానికి కథానాయికను ఖరారు చేయలేదు. త్వరలోనే సినిమా లాంచింగ్ ఉంటుంది. అప్పుడు కాస్ట్ అండ్ క్రూ గురించి మరిన్ని వివరాలు బయటికి వస్తాయి.

This post was last modified on January 4, 2025 6:07 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

8 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

9 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

9 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

9 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

11 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

12 hours ago