Movie News

మోహన్ లాల్ కాస్ట్లీ మిస్టేక్!

మలయాళంలో ఎన్నో ఏళ్ల నుంచి నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు మోహన్ లాల్. తన తరంలో మమ్ముట్టితో పాటు కొత్త తరంలో అనేకమంది యంగ్ హీరోల నుంచి గట్టి పోటీ ఉన్నా.. నిలకడగా బ్లాక్ బస్టర్లు కొడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారాయన. ఐతే ఇన్నేళ్లలో ఎప్పుడూ చేయని సాహసం ఈ ఏడాది ఆయన చేశారు. స్వీయ దర్శకత్వంలో ‘బరోజ్’ అనే భారీ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రానికి నిర్మాతగా ఆయన పేరు పడలేదు కానీ.. ప్రొడక్షన్ అంతా ఆయనదే.

ఆశీర్వాద్ సినిమాస్ అంటే ఆయన సొంత సంస్థ లాంటిదే. మోహన్ లాల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రాల్లో ఇదొకటి. ఏకంగా రూ.80 కోట్లు ఖర్చు పెట్టి తీశారు ఈ పీరియడ్ మూవీని. ఐతే చివరికి ఇది మోహన్ లాల్ చేసిన కాస్ట్లీ మిస్టేక్ అనే పేరు తెచ్చుకుంది. రిలీజ్‌కు ముందు పెద్దగా హైప్ తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం.. విడుదల తర్వాత ఆశించిన స్పందన రాబట్టుకోలేకపోయింది. కాన్సెప్ట్ బాగున్నా.. ఎగ్జిక్యూషన్ చాలా బోరింగ్‌గా సాగడంతో ‘బరోజ్’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

మామూలుగా మోహన్ లాల్ సినిమాలంటే టాక్‌తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఈ చిత్రం తొలి రోజు కేరళలో రూ.3 కోట్ల లోపు వసూళ్లు మాత్రమే రాబట్టింది. వీకెండ్లో కేవలం రూ.6 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఈ సినిమా మీద పెట్టి బడ్జెట్, జరిగిన బిజినెస్‌తో పోలిస్తే ఈ వసూళ్లు దారుణం అన్నట్లే. గత వారం రిలీజైన ఉన్ని ముకుందన్ సినిమా ‘మార్కో’ అదిరిపోయే టాక్ తెచ్చుకుని వసూళ్ల మోత మోగిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాని దూకుడు ముందు ‘బరోజ్’ ఏమాత్రం నిలవలేకపోయింది. ఉన్ని ముకుందన్.. లాల్‌తో పోలిస్తే చిన్న హీరో. అలాంటి నటుడి సినిమా ముందు లాల్ మూవీ వెలవెలబోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ హీరో లేక లేక దర్శకత్వం చేస్తే.. ఇలాంటి ఫలితం రావడం వారికి పెద్ద షాక్. మళ్లీ లాల్ మెగా ఫోన్ పట్టే సాహసం చేయలేనంత దారుణమైన ఫలితాన్ని అందించింది ‘బరోజ్’.

This post was last modified on December 29, 2024 9:50 pm

Share

Recent Posts

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

5 hours ago