అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరవడంలో త్రివిక్రమ్ పాత్ర చాలా వుంది. అంతకుముందు యూత్ ఫాలోయింగ్ మాత్రమే వున్న అల్లు అర్జున్‍కి ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో త్రివిక్రమ్ ఫ్యామిలీ ఆడియన్స్ని జత చేసాడు. మాస్‍లో ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ లాంటి రీచ్ లేకపోయినా కానీ ఈ రెండు సెక్షన్స్ వల్ల అల్లు అర్జున్ సినిమాల రేంజ్ పెరుగుతోంది.
యూత్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ వుంటే ఒక సినిమా ఎంత పెద్ద హిట్టవుతుందనేది ‘అల వైకుంఠపురములో’ విషయంలో స్పష్టమయింది. త్రివిక్రమ్‍తో తన కాంబినేషన్ భేషుగ్గా వర్కవుట్ అవడంతో మరోసారి త్రివిక్రమ్ సినిమాను లైన్లో పెట్టాలని అల్లు అర్జున్ ఉవ్విళ్లూరుతున్నాడు. పుష్ప తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్న అల్లు అర్జున్ ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమా చేయాలని చూస్తున్నాడు.
త్రివిక్రమ్‍కి తారక్, మహేష్, చరణ్‍తో కమిట్‍మెంట్స్ వున్నాయి. అలాగే చిరంజీవి, వెంకటేష్‍తో కూడా చెరో ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు. మరి వీటన్నిటి మధ్య మళ్లీ అల్లు అర్జున్ సినిమాకు ఎక్కడ స్పేస్ ఇస్తాడనేది తెలియదు. కాకపోతే అల్లు అర్జున్ తీసుకునే ఎక్స్ట్రా కేర్ ప్లస్ తన పర్సనల్ టీమ్ సలహాలు, సంప్రదింపుల వల్ల త్రివిక్రమ్ పని ఈజీ అయిపోతూ వుంటుంది కనుక త్రివిక్రమ్‍కి అతనితో పని చేయడం ఎప్పుడూ హ్యాపీనే.
This post was last modified on October 11, 2020 4:33 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…