ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు దరిమిలా.. ఆయన జైలుకు వెళ్లడం.. ఆ వెంటనే బెయిల్ దక్కడం వంటి పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా.. బ్రేకింగ్ న్యూస్‌గా హల్చల్ చేసింది. క్షణ క్షణం ఉత్కంఠగా మారిపోయింది. ఎందుకంటే.. ఒకే సమయంలో రెండు న్యాయస్తానాల్లో ఈ కేసు విచారణకు వచ్చింది. హైదరాబాద్ స్థానిక కోర్టులో అర్జున్‌కు వ్యతిరేకంగా.. పోలీసులు బలమైన వాదన వినిపించారు. ఇదేసమయంలో ఆయన బెయిల్ కోసం.. అప్పటికప్పుడు హైకోర్టును ఆశ్రయించడం.
ఈ రెండు కేసులలో కూడా.. సమాంతరంగా వాదనలు వినిపించారు. ఈ పరిణామం ఇలా ఉంటే.. ఒకవైపు.. సాయంత్రం అయిపోవడం.. జైలు, బెయిలు నిబంధనల ప్రకారం.. పొద్దెక్కిన తర్వాత బెయిల్ దక్కుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు శనివారం, ఆదివారం కావడంతో రెండు రోజులు కూడా.. బన్నీజైల్లోనే ఉంటారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన అభిమానులు ఆవేదనకు గురైన విషయం తెలిసిందే. మెగా కుటుంబం కూడా.. ఈ విషయంలో ఇక చేసేది ఏముందని అనుకుంది.
అయితే.. బన్నీకి హుటాహుటిన బెయిల్ వచ్చేసింది. రాత్రి 7 గంటల సమయంలో హైకోర్టు నుంచి ఉత్త ర్వు లు కూడా వచ్చాయి. అయితే.. అప్పటికే సాయం సంధ్య ముగిసి పోయి.. బన్నీ బ్యారక్‌లోకి చేరుకోవడంతో లాంఛనంగానే ఆయన శుక్రవారం రాత్రి జైల్లో గడపాల్సి వచ్చింది. ఇక, శనివారం ఉదయం ఆయన విడుదలయ్యారు. అయితే.. ఇలా ఉన్నట్టుండి.. బెయిల్ దక్కించుకోవడం అనేది బహుశ ఇదే తొలిసారి అని అంటున్నారు న్యాయ నిపుణులు. ఎంతో బలమైన వాదనలు ఉంటే తప్ప.. ఇలా బెయిల్ దక్కడం సాధ్యం కాదని కూడా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే బన్నీ తరఫున హైకోర్టులో ముందస్తు బెయిల్‌పై వాదనలు వినిపించిన వైసీపీ నాయకుడు, ఆ పార్టీ ఎంపీ నిరంజన్‌రెడ్డి వ్యవహారం చర్చకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో నిరంజన్ రెడ్డిపై ప్రశంసలు కురుస్తున్నాయి. తక్కువ సమయంలో(కేవలం గంట న్నర సేపు హైకోర్టులో వాదనలు జరిగాయి) బన్నీకి బెయిల్ వచ్చేలా చేశారని బన్నీ అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇదిలావుంటే.. ఈ కేసును వాదించేందుకు మొత్తంగా ముగ్గురు న్యాయవాదులు.. బన్నీ కోసం పనిచేశారు.
అప్పటికప్పుడు అనేక కేసులను తిరగదోడారు. వాటి ఆధారంగానే.. బన్నీకి బెయిల్ వచ్చేలా వాదనలు వినిపించారు. ఇక ఈ కేసులు వాదించిన వారిలో ఫస్ట్ న్యాయవాదిగా ఉన్న నిరంజన్‌రెడ్డి ఒక్క రోజు కోసం.. ఏకంగా 30 లక్షలు తీసుకున్నట్టు న్యాయ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఆయన రోజువారి వాదనల ఫీజు.. 8-10 లక్షల వరకు ఉంటుందని.. కానీ, ఇలాంటి అనూహ్య కేసుల్లో మాత్రం ఆయన ఎక్కువగానే తీసుకుంటారని చెబుతున్నారు.
తక్కువలో తక్కువగా బన్నీ ఫ్యామిలీ రూ.30 లక్షల ఫీజును ఒక్క నిరంజన్‌రెడ్డికే ఇచ్చిందని న్యాయ వర్గాలు చెబుతుండడం గమనార్హం. ఇక, న్యాయవాదులకు 3-5 లక్షల మధ్యలో ఫీజులు చెల్లించారని చెబుతున్నారు. అయితే.. సొమ్ము పోయినా.. ఫలితం భాగానే దక్కడంతో బన్నీ కుటుంబం హ్యాపీగానే ఉండడం గమనార్హం.
This post was last modified on December 14, 2024 3:00 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…