ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి అల్లు అర్జున్ కు బెయిల్ రాదు..ఆయన చంచల్ గూడ జైల్లో రిమాండ్ కు వెళ్లడం ఖాయం అని అందరూ భావించారు. అయితే, అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు, మెగా కుటుంబ సభ్యుల, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అందుకు కారణం అల్లు అర్జున్ తరఫున వాదనలు వినిపిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి.
అల్లు అర్జున్ తరఫున తెలంగాణ హైకోర్టులో నిరంజన్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. అంతేకాకుండా, 2017లొ రయీస్ చత్రం ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైందని గుర్తు చేశారు. ఆ సమయంలో కోర్టు షారుఖ్ కు అనుకూలంగా తీర్పునిచ్చిందని గుర్తు చేశారు.
సంధ్య ధియేటర్ ఘటన రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ప్లోర్ కు వచ్చారని రాసి ఉందని, అప్పటికే మృతురాలు రేవతి, ఆమె కుమారుడు తొక్కిసలాటలో గాయపడ్డారని వాదనలు వినిపించారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్ లు జరిగినపుడు కూడా పోలీసులు క్రికెట్ చూస్తుంటారని వాదించారు. దీంతో, నిరంజన్ రెడ్డి పేరు ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. నిరంజన్ రెడ్డి ప్రొఫైల్ గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి లాయర్ ఎస్.నిరంజన్ రెడ్డి అత్యంత సన్నిహితులు. మెగాస్టార్ చిరంజీవికి, మెగా కుటుంబానికి లీగల్ అడ్వయిజర్ గా చాలాకాలంగా పనిచేస్తున్నారు. ఆ అనుబంధంతోనే మెగా ఫ్యామిలీతో కలిసి టాలీవుడ్ లో నిర్మాతగా కూడా మారారు నిరంజన్ రెడ్డి. 2011లో గగనం చిత్రంతో నిర్మాతగా తెరంగేట్రం చేసిన నిరంజన్ రెడ్డి ఆ తర్వాత క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్, ఆచార్య చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అల్లు అర్జున్ అరెస్టు వార్త విన్న వెంటనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాల్సిందిగా నిరంజన్ రెడ్డిని పురమాయించారు చిరంజీవి. ఈ క్రమంలోనే తన వాదనా పటిమతో అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చేలా చేశారు నిరంజన్ రెడ్డి.
ఏపీ మాజీ సీఎం జగన్ కు సంబంధించిన పలు కేసులను దశాబ్దం క్రితం వాదించిన అనుభవం నిరంజన్ రెడ్డికి ఉంది. ఆ క్రమంలోనే రాజ్యసభకు వైసీపీ తరఫున 2022లో నిరంజన్ రెడ్డి నామినేట్ అయ్యారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, అల్లు అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, చిరంజీవి కలిసి ఈ కేసులో వాదనలు వినిపించేందుకు నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారట. వైసీపీ నేతలకు చెందిన పలు కేసులను కూడా నిరంజన్ రెడ్డికి శిల్పా రవిచంద్రరెడ్డి అప్పగించారని తెలుస్తోంది.
This post was last modified on December 14, 2024 7:44 am
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…