బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ది రూల్ జోరు చూస్తుంటే కనీసం మూడు వారాల దాకా శాంతించేలా కనిపించడం లేదు. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా మొదటి నాలుగు రోజుల్లోనే ఇంత భారీగా చూశారంటే ఇక సాధారణ ధరలు అమలులోకి వచ్చాక థియేటర్ల దగ్గర ఏ స్థాయిలో ఉంటారో ఊహించుకోవడం కష్టమే. హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ దాకా, జగిత్యాల నుంచి జైపూర్ దాకా అన్ని చోట్లా ఒకే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఫస్ట్ వీక్ కాకుండానే వెయ్యి కోట్ల మీద కన్నేసిన పుష్పరాజ్ అరాచకం త్వరగా తగ్గకపోతే ఏంటన్న టెన్షన్ క్రిస్మస్ కి రిలీజ్ కాబోతున్న కొత్త సినిమాలకు పట్టుకుంది. అదెందుకో చూద్దాం.
డిసెంబర్ నుంచి గేమ్ ఛేంజర్ తప్పుకున్నాక చాలా సినిమాలు క్రిస్మస్ రేస్ లోకి వచ్చాయి. డిసెంబర్ 20 ఈ తాకిడి ఎక్కువగా ఉంది. అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మీద మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. మాస్ కంటెంట్ అందరికీ నచ్చుతుందని, షాకింగ్ ఎలిమెంట్స్ థ్రిల్ ఇస్తాయని ఊరిస్తున్నారు. ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ కామెడీని నమ్ముకుని వస్తోంది. ఉపేంద్ర ‘యుఐ’ మీద తక్కువ హైప్ లేదు. విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 2’కి తెలుగులో మంచి డిస్ట్రిబ్యూటర్లు దొరికారు. వీటితో పాటు హాలీవుడ్ మూవీ ‘ముఫాసా లయన్ కింగ్’ కోసం పెద్ద ఎత్తున స్క్రీన్లు రెడీ అవుతున్నాయి. ఇక్కడితో అయిపోలేదు.
డిసెంబర్ 25 నితిన్ ‘రాబిన్ హుడ్’ తో దిగుతాడు. పుష్ప 2 నిర్మించిన మైత్రినే నిర్మాత కావడంతో థియేటర్ల అడ్జస్ట్ మెంట్ పెద్ద సమస్య కాదు. వెన్నెల కిషోర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, కిచ్చ సుదీప్ మ్యాక్స్ లతో పాటు విజయ్ తేరి బాలీవుడ్ రీమేక్ బేబీ జాన్ కవ్వించుకుంటున్నాయి. పుష్ప 2 దూకుడు కనక తగ్గకపోతే ఎగ్జిబిటర్లు దీన్నే కొనసాగించేందుకు ఇష్టపడతారు. ఎన్ని రిలీజులున్నా బన్నీ గ్రాండియర్ ను సవాల్ చేసేది ఏది లేదు. అన్నీ కంటెంట్ ని నమ్ముకున్నవే. పుష్ప 2 యావరేజ్ అయ్యుంటే ఈ చర్చ ఉండేది కాదు కానీ ఇండస్ట్రీ హిట్ దిశగా పరుగులు పెట్టడమే ఈ ఆందోళనకు అసలు కారణం.
This post was last modified on December 8, 2024 2:41 pm
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన…
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవాలన్న కోటి ఆశలతో వచ్చి ప్రాణాలు కోల్పోయిన వారిని తలచుకుంటేనే కన్నీళ్లు…
కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా ప్రదర్శిస్తున్న ప్రీమియర్ షోలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన సందర్భంగా…
తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖలో ఉన్న చంద్రబాబు…
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు కం ఏపీ మంత్రి నారా లోకేశ్ తీరు…
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఐకానిక్ సెలబ్రేషన్స్ అంటే ముందు గుర్తొచ్చే పేరు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్…