రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ఉన్న బంధం గురించి కథనాలు, ఫోటోలు ఎన్ని వస్తున్నా వాటి గురించి ఎప్పుడూ స్పందించని ఇద్దరూ ఇతరత్రా రూపాల్లో మాత్రం బయట పెడుతూ ఉంటారు. రష్మిక టైటిల్ పోషించిన ది గర్ల్ ఫ్రెండ్ త్వరలో విడుదలకు సిద్ధం కాబోతున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన పుష్ప 2 ది రూల్ హైదరాబాద్ వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ లో సుకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించింది దీని గురించే. ఎల్లుండి రిలీజ్ కాబోతున్న పుష్ప 2 థియేటర్లలో దీన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. అసలు ప్రత్యేకత వేరే ఉంది. అదేంటో చూద్దాం.
ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ లో రష్మిక మందన్న పాత్రను, నేపధ్యాన్ని విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో చెప్పించారట. ఈ సినిమాకే ఎందుకతను ప్రత్యేకంగా గొంతు ఇచ్చాడంటే కారణాలు ఏమిటో ఆ మధ్య చెన్నై ఈవెంట్ లో రష్మిక అన్నట్టు అందరికీ తెలిసిన విషయమే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ది గర్ల్ ఫ్రెండ్ లో రష్మిక మందన్నకు నటనకు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కిందని సమాచారం. ప్రత్యేకంగా స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా రష్మిక చుట్టూ తిరిగే కథను డిఫరెంట్ జానర్ లో సెట్ చేశారట. పుష్ప 2 తర్వాత రష్మికకు ఉండబోయే నెక్స్ట్ రిలీజ్ ఇదే కావొచ్చు.
ప్యాన్ ఇండియా భాషల్లో ది గర్ల్ ఫ్రెండ్ వెళ్లనుంది. యానిమల్, పుష్ప బ్లాక్ బస్టర్లతో రష్మికకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేసింది. అంతకు ముందే బాలీవుడ్ సినిమాలు చేసినా ఇప్పుడు మార్కెట్ లెక్కలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ది గర్ల్ ఫ్రెండ్ మంచి బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. రిలీజ్ డేట్ టీజర్ లోనే ప్రకటిస్తారా లేదానేది వేచి చూడాలి. అస్సలు పడను అనే డైలాగ్ తో కొత్తగా ట్రై చేసినట్టు చెబుతున్నారు. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించగా హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించారు.
This post was last modified on December 3, 2024 3:42 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…