ఇంకో రెండు రోజుల్లో పుష్ప 2 ది రూల్ థియేటర్లలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో అంచనాలను కొలవాలంటే ఎవరికి సాధ్యం కాదనే రీతిలో హైప్ కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్లకు సంబంధించిన వేడుకలకు ముగింపు పలికినట్టే. రిలీజయ్యాక సక్సెస్ మీట్ తో మళ్ళీ చూడాలి కాబట్టి అప్పటిదాకా చిన్న బ్రేక్ తప్పదు. పబ్లిసిటీ విషయంలో అంతా తన భుజాల మీద మోసిన అల్లు అర్జున్ భారాన్ని నిన్న దర్శకుడు సుకుమార్ పంచుకున్నారు. ఎంత కష్టపడింది కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అక్కడ వినిపించింది కానీ తాజాగా వదిలిన మేకింగ్ వీడియోలో కనిపించింది.
నిజానికి పుష్ప 2 ఫాంటసీ, విఎఫెక్స్ జానర్ కాదు. సింపుల్ గా చెప్పాలంటే పక్కా కమర్షియల్ బొమ్మ. ఇలాంటివి మాస్ నే టార్గెట్ చేసుకుంటాయి. కానీ ఒక ప్యాన్ ఇండియా మూవీగా సుకుమార్ ఎంత చెమట చిందించింది, ఆర్టిస్టుల నుంచి బెస్ట్ రాబట్టుకోవడానికి ఎంత తపన పడింది రెండు నిమిషాల వీడియోలో చాలా చూపించేశారు. యాక్షన్ ఎపిసోడ్లు, అల్లు అర్జున్ రిస్క్ తీసుకుని చేసిన స్టంట్లు, జాతర ఫైట్, హెలికాఫ్టర్ ఛేజ్ వగైరాలన్నీ శాంపిల్స్ రూపంలో వదిలారు. చిన్న ఎక్స్ ప్రెషన్ల కోసం సుకుమార్ రాజీ పడకుండా ఎలా చేస్తారనే అవగాహన ఇందులో చూపించారు. తెరవెనుక మొదటి శ్రామికుడు సుకుమారే.
బన్నీ అన్నట్టు ఈ క్రియేటివ్ జీనియస్ కోసమైనా పుష్ప 2 బ్లాక్ బస్టర్ అవ్వాలని సగటు మూవీ లవర్స్ కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయిదేళ్ల కాలాన్ని పుష్ప రెండు భాగాల కోసం కేటాయించిన సుకుమార్ మళ్ళీ పుష్ప 3 తీస్తారో లేదో తెలియదు కానీ ఒక మాస్ మూవీకి ఇంత హైప్ తీసుకురావొచ్చని రుజువు చేసింది మాత్రం ఈ కాంబోనే. దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఫహద్ ఫాసిల్ వరకు, రష్మిక మందన్న నుంచి శ్రీలీల వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి గొప్ప మైలురాయిగా నిలిచిపోనున్న పుష్ప 2 ది రూల్ ఏకంగా రాజమౌళి రికార్డునే లక్ష్యంగా పెట్టుకుంది. టాక్ పాజిటివ్ వస్తే మాత్రం ఐకాన్ స్టార్ అన్నంత పని చేస్తాడు.
This post was last modified on December 3, 2024 1:08 pm
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…