ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన సినిమాలు బాగా తగ్గించేశారు. ఐతే తన పాత క్లాసిక్ సాంగ్స్‌ను ఎక్కడైనా మ్యూజికల్ కన్సర్ట్స్‌లో వాడుకున్నా.. లేదా సినిమాల్లో ఉపయోగించినా ఆయన ఊరుకోవట్లేదు. ఏమాత్రం సంకోచించకుండా లీగల్ నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఈ విషయంలో ఇళయరాజాను తప్పుబట్టేవాళ్లున్నారు. అలాగే సమర్థించే వాళ్లూ ఉన్నారు. గతంలో తన ఆప్త మిత్రుడైన ఎస్పీ బాలు విషయంలో కూడా ఆయన తగ్గలేదు. ఎవరేమన్నా తన దారిలో తాను సాగిపోతూనే ఉన్నారు. ఈ విషయంలో తన మీద వచ్చే విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఇళయరాజా తాజాగా తన మీద తనే కౌంటర్ వేసుకోవడం విశేషం. ఇళయరాజా సంగీతం అందించిన ‘విడుదల-2’ సినిమా ఆడియో వేడుకలో ఇది జరిగింది.
నా రికార్డింగ్స్ వాడుకుంటే నీకైనా నోటీసులే : వెట్రి మారన్ తో ఇళయరాజా!
Gulte Telugu Telugu Political and Movie News Updates