రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం మీద నెట్ ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ‘బియాండ్ ద ఫేరీ టెయిల్’ కోసం తన భర్త దర్శకత్వంలో తాను నటించిన ‘నానుం రౌడీ దా’ నుంచి విజువల్స్ తీసుకోవడానికి ఆ చిత్ర నిర్మాత అయిన ధనుష్ అంగీకరించకపోవడం.. మూడు సెకన్ల ఓ విజువల్ వాడుకున్నందుకు పది కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని లీగల్ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహంతో నయనతార పెట్టిన ఇన్‌స్టా పోస్టు వైరల్ అయింది.
ఈ వివాదంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరి వైపు మాట్లాడుతున్నారు. తాను నటించిన సినిమా నుంచి ఓ విజువల్ వాడుకునే హక్కు నయనతారకు లేదా, ధనుష్ ఇంత కమర్షియలా అని కొందరు ప్రశ్నిస్తుంటే.. నయన్ చేస్తోంది ఛారిటీ కాదు కదా, నిర్మాతగా ధనుష్‌కు తన సినిమాపై హక్కులుంటాయి కదా అని ఇంకో వర్గం వాదిస్తోంది.
ధనుష్ అభిమానులు నిన్నట్నుంచి నయన్ మీద తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. నయన్-విఘ్నేష్ శివన్ కలిసి ‘నానుం రౌడీ దా’ బడ్జెట్ అయిన కాడికి పెంచేశారని.. సినిమా హిట్టయినా ధనుష్‌కు నష్టం రావడంతో అతను ఇబ్బంది పడ్డాడని, ఇప్పుడు కోట్లు తెచ్చి పెడుతున్న డాక్యుమెంటరీ కోసం మళ్లీ ఆ విజువల్స్ కావాలా అని ఆమెను ప్రశ్నిస్తున్నారు. నయనతార సినిమా ప్రమోషన్లకు రాకపోవడాన్ని గుర్తు చేసి తనను తిడుతున్నారు.
ఐతే నయన్ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో ఎదురుదాడి చేస్తున్నారు. ధనుష్ కోసం నయన్ చేసిన సాయాన్ని గుర్తు చేస్తున్నారు. అతడి ప్రొడక్షన్లో శివకార్తికేయన్ హీరోగా రూపొందిన ‘ఎదిర్ నీచ్చిల్’ సినిమాలో నయన్ ఐటెం సాంగ్ చేయగా.. దాని కోసం పారితోషకం కూడా తీసుకోని విషయాన్ని ధనుషే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మరి తనతో ఒక పాటే ఫ్రీగా చేయించుకున్న ధనుష్.. ఇప్పుడు ఆమె నటించిన సినిమాలో విజువల్స్ కోసం డబ్బులు డిమాండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ వివాదం మీద ధనుష్ ఏం మాట్లాడతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
This post was last modified on November 17, 2024 8:36 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…