సమంత ఇప్పుడు జస్ట్ సినిమా హీరోయిన్ కాదు. వెబ్ సిరీస్ స్పెషలిస్ట్. ఆల్రెడీ ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో రాజీ అనే నెగెటివ్ పాత్రలో అదరగొట్టిన సామ్.. తాజాగా ‘సిటాడెల్’లో లీడ్ రోల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె కెరీర్‌కు ఈ రకమైన మేకోవర్ ఇచ్చిన ఘనత తెలుగువారైన బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్-డీకేలకే చెందుతుంది.
‘సిటాడెల్’ కోసం సమంత అందుబాటులోకి రాని స్థితిలో ఆమె కోసమే వెయిట్ చేసి మరీ ఈ సిరీస్ తీశారు. తనకు అంత విలువ ఇచ్చిన దర్శకుల గురించి ఒకప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నట్లు సమంత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వాళ్ల శైలి తనకు నచ్చక ఒక దశలో తన మేనేజర్‌కు ఫోన్ చేసి ఏడ్చినట్లు సమంత గుర్తు చేసుకుంది.
“రాజ్-డీకేలతో పని చేయడం కంటే తెలుగు, తమిళ సినిమాల్లో వర్క్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మామూలుగా నేను నటించిన సినిమాల్లో రోజుకు రెండు లేదా మూడు సీన్స్ తీస్తారు. కానీ ‘ఫ్యామిలీ మ్యాన్’ కోసం పని చేసినపుడు రాజీ పాత్రకు సంబంధించిన కొన్ని కీ సీన్స్, ఒక ఫైట్ సీక్వెన్స్ మొదటి షెడ్యూల్లోనే తీసేశారు. అది చాలా కష్టమనిపించింది. వాళ్ల శైలికి అలవాటుపడలేకపోయాను. రెండు రోజుల తర్వాత నా మేనేజర్‌కు ఫోన్ చేసి నా వల్ల కావట్లేదు, ఇంటికి వచ్చేస్తానని ఏడ్చాను. కానీ తర్వాత నెమ్మదిగా వాళ్ల శైలికి అలవాటు పడ్డాను” అని సమంత తెలిపింది.
ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్-డీకే మాట్లాడుతూ.. ఫ్యామిలీ మ్యాన్-2 చేస్తున్నపుడు సమంత వ్యక్తిగతంలో చాలా ఎమోషన్లతో ఇబ్బంది పడుతున్నారని తమకు తెలియదని అన్నారు. చెన్నైలో రెండు రోజుల షూట్ అవ్వగానే షూట్ అయిపోయిందా లేదా అని అడిగిందని.. అయిపోయిందని చెప్పగానే చిన్న పిల్లలాగే ఏడ్చేసిందని.. ఆమెను తాము చాలా కష్టపెడుతున్నామని అర్థమైందని చెప్పారు.
This post was last modified on November 11, 2024 2:30 pm
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…