నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుంచి ఒకేసారి రెండు సినిమాలు సంక్రాంతి సీజన్ లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ జనవరి 10 ఆల్రెడీ లాక్ చేసుకోగా తాజాగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంని జనవరి 14 రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇది చివరి డేట్ అయినప్పటికీ ఎఫ్2 గతంలో ఇలాగే లాస్ట్ లో వచ్చి లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన వైనాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. చరణ్, వెంకీ మధ్య నాలుగు రోజులు గ్యాప్ రావడం వల్ల థియేటర్ డిస్ట్రిబ్యూషన్ పరంగా దిల్ రాజు బృందానికి వెసులుబాటు దొరుకుతుంది. అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
దీంతో పండగ పోటీలో ఉన్న ఇద్దరు నిర్ణయాలు తీసుకోగా నెక్స్ట్ బాలకృష్ణ 109 వంతు రావాల్సి ఉంది. సిజి వర్క్ వల్ల టైటిల్ అనౌన్స్ మెంట్ చేయలేదని ఇటీవలే దీపావళి పండగ సందర్భంగా నిర్మాత నాగవంశీ చెప్పడం చూశాం. మళ్ళీ ఫెస్టివల్ అకేషన్ లేకపోయినా ఇంకో నాలుగైదు రోజుల్లో ఆ లాంఛనం చేయాలని చూస్తున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం జనవరి 12కు బాలయ్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఒకవేళ ఏదైనా మార్పు ఉండే అవకాశం ఉందేమోనని టీమ్ ఎదురు చూస్తోంది కాబోలు. సందీప్ కిషన్ మజాకా సైతం వెంకీతో పాటు జనవరి 14 లేదా ఒకరోజు ముందు 13న వచ్చే ఛాన్స్ ఉంది.
ఇవి కాకుండా గుడ్ బ్యాడ్ అగ్లీకు సంబంధించిన సరైన అప్డేట్ రావడం లేదు. కోలీవుడ్ కు ఎంతో కీలకమైన పొంగల్ కు రెండు అజిత్ సినిమాలు పూర్తయ్యే స్టేజిలో ఉన్నా ఒక్కదాని ప్రకటన కూడా ఇవ్వకపోవడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఒకవేళ ఇది తప్పుకునే పక్షంలో విదాముయార్చి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది తేలడానికి ఒకటి రెండు వారాలు టైం పట్టేలా ఉంది. థియేటర్ అగ్రిమెంట్లు ఇప్పటి నుంచే చేసుకోవాలి కాబట్టి దానికి అనుగుణంగా నిర్మాతలు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ హడావిడిలో ట్రేడ్ వర్గాలు బిజీగా ఉన్నాయి. సో డిసెంబర్ రెండో వారంలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేస్తుంది.
This post was last modified on November 6, 2024 3:54 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…