రేపు విడుదల కాబోతున్న ‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగ చైతన్య ఏదో మొక్కుబడిగా నాలుగు మాటలు మాట్లాడకుండా కిరణ్ అబ్బవరంని తానెంత ఇష్టపడతాడో చెప్పడం ద్వారా అందరి అభిమానులను ఆకట్టుకున్నాడు. కిరణ్ బాల్యం, చిన్నప్పుడు అతని తల్లి పడిన కష్టాలు, ఇద్దరు పిల్లలు చదువుకోవాలనే తపనతో కువైట్ వెళ్ళిపోయి అక్కడి నించి కుటుంబాన్ని పోషించడం లాంటివి విని కళ్లనీళ్లు పెట్టుకున్నంత పనైందని, ఇంతటి వ్యథ ఉన్న కిరణ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా పెద్ద స్థాయికి చేరుకోవాలంటూ ప్రోత్సహించడం నచ్చింది.
ప్రీమియర్లకు సిద్ధపడ్డ ‘క’కు చైతు ప్రసంగం మంచి బూస్ట్ గా మారబోతోంది. కిరణ్ అబ్బవరంని వ్యక్తిగతంగా తాను ఎంత ఇష్టపడతానో చెప్పిన నాగ చైతన్య ట్రోలింగ్ గురించి అసలు పట్టించుకోవద్దంటూ, చేతిలో మొబైల్ తప్ప ఇంకే పని లేని వాళ్ళు మాత్రమే అలాంటి పనులు చేస్తారని చెప్పడం ధైర్యాన్ని ఇచ్చింది. వ్యక్తిగతంగా ఇంట్రోవర్ట్ అయిన తాను కిరణ్ తో మాత్రం త్వరగా కలిసిపోయానని, అతని జర్నీకి నెంబర్ వన్ ఫ్యాన్ అంటూ కితాబు ఇవ్వడం ఫ్యాన్స్ కిక్ ని పెంచింది. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ‘క’ వేడుకలో చూసినంత ఎమోషన్ గతంలో కిరణ్ ఏ సినిమాకు లేదన్నది వాస్తవం.
మొత్తానికి కిరణ్, చైతుల స్నేహం ‘క’కు ఉపయోగపడటం కన్నా కావాల్సింది ఏముంటుంది. సుజీత్ – సందీప్ జంట దర్శకత్వం వహించిన ఈ విలేజ్ థ్రిల్లర్ మీద టీమ్ నమ్మకం మాములుగా లేదు. తీవ్రమైన పోటీ ఉన్నా సరే క్లాష్ కు సిద్ధపడింది. ఇవాళ అర్ధరాత్రి లోపే టాక్ వచ్చేస్తుంది కాబట్టి దాని ప్రభావం రేపు ఓపెనింగ్స్ మీద ఉంటుంది. పాజిటివ్ అయితే మాత్రం దీపావళి సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ మంచి వసూళ్లకు గ్యారెంటీ ఇస్తుంది. ఏడాదిన్నర సమయం దీని కోసమే వెచ్చించిన కిరణ్ అబ్బవరం నిన్న జరిగిన ఈవెంట్ వల్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి మద్దతు తెచ్చేసుకున్నాడు.
This post was last modified on October 30, 2024 11:18 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…