మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతికి అనుకున్న ఈ చిత్రం వాయిదాకు పడిపోయింది. సంక్రాంతి రిలీజ్ అయితే.. దీని తర్వాత ఆయన చేసే సినిమా గురించి ఈపాటికే క్లారిటీ వచ్చేసేది. ఐతే చిరు నుంచి ఏ సమాచారం లేకపోయినా.. ఆయనతో సినిమా చేయబోతున్న విషయాన్ని రైటర్ బీవీఎస్ రవి ధ్రువీకరించాడు.
విశ్వంభర తర్వాత చిరు తమ సినిమానే చేస్తాడని రవి ప్రకటించాడు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రవి మీడియాతో మాట్లాడారు. చిరుతో సినిమాను ఈ సమయంలోనే కన్ఫమ్ చేశారు. ఐతే రవికి దర్శకుడిగా కూడా అనుభవం ఉన్నప్పటికీ.. చిరుతో చేయబోయే చిత్రానికి అతను రచయిత మాత్రమే చిరుతో తాము చేయబోయే సినిమా కథ ఎలా ఉంటుందో కూడా హింట్ ఇచ్చాడు రవి.
విశ్వంభర పూర్తయిన తర్వాత చిరంజీవి గారితో మేం సినిమా చేస్తాం. ఆయన డ్యాన్సులు, ఫైట్లను ప్రేక్షకులు చూసేశారు. సామాజిక అంశాలతో ముడిపడ్డ కథాంశాలతో సినిమాలు చేస్తే వాటినీ ఆదరించారు. అగ్ర హీరోలు సోషల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు చేస్తే వాటి గురించి ఎక్కువమంది జనాలకు తెలుస్తుంది. మేం కూడా ఆయనతో అలాంటి సినిమానే చేయాలనుకుంటున్నాం అని బీవీఎస్ రవి తెలిపాడు. రవి పని చేస్తున్నది తమిళ దర్శకుడు మోహన్ రాజా సినిమాకు అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇంతకుముందు చిరుతో గాడ్ ఫాదర్ మూవీ తీసిన మోహన్ రాజా.. చిరుతో మరో సినిమా చేయడానికి ఆసక్తి ప్రదర్శించాడు. చిరు కూడా సుముఖత వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కథ తయారవుతోంది. చిరు అందుబాటులోకి వచ్చాక ఈ సినిమాను మొదలుపెడతారు. చిరు తనయురాలు సుష్మిత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. విశ్వంభర కంటే ముందే ఆమె బేనర్లో చిరు సినిమా అనుకున్నా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు.
This post was last modified on October 28, 2024 10:14 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…