‘బాహుబలి’ తర్వాత ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ట్రెండు ఊపందుకుంది. ఐతే పెద్ద విజయం సాధించిన సినిమాలకు మూడో భాగం తీసే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. ‘బాహుబలి-3’ గురించి ఇటీవల కూడా ఓ చర్చ జరిగింది. ‘కేజీఎఫ్’ కథకు కూడా మూడో భాగం తీసే ఆలోచన ప్రశాంత్ నీల్‌కు ఉంది. ఇప్పుడు ‘పుష్ప-2’ విడుదలకు ముందే ‘పుష్ప-3’ గురించి చర్చలు ఊపందుకున్నాయి. ఈ కథకు మూడో భాగం తీసే ఆలోచన సుకుమార్‌కు ఉందని.. ఆ దిశగా సినిమాలో లీడ్ ఇవ్వబోతున్నారని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత రవిశంకర్ కూడా ధ్రువీకరించారు.
‘పుష్ప-3’కి అదిరిపోయే లీడ్ ఇస్తున్నారని.. మూడో భాగం ఉంటుందని ఆయన సంకేతాలు ఇచ్చారు. కానీ లీడ్ ఉంది సరే, నిజంగా ఈ సినిమా తీసే అవకాశముందా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.
‘పుష్ప-2’ అనుకున్న దాని కంటే బాగా ఆలస్యం అయింది. రెండేళ్లలో ‘పుష్ప’ చేసేసి వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవ్వాలని అనుకున్న అల్లు అర్జున్ ఐదేళ్లకు పైగా ఇందులోనే ఉండిపోయాడు. రెండో భాగం అనుకున్నా సరే మొత్తంగా మూడేళ్లలో రెండు సినిమాలూ అయిపోతాయని అనుకున్నాడు బన్నీ. కానీ ఇంకో రెండేళ్లకు పైగా అదనపు సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఒకే పాత్ర తాలూకు లుక్, మూడ్‌లో ఇన్నేళ్ల పాటు ఉండి.. దాని కోసం విపరీతంగా కష్టపడి.. గతంలో మరే చిత్రానికీ లేనన్ని కాల్ షీట్స్ ఈ సినిమాకే ఇచ్చి బన్నీ విసిగిపోయినట్లు సమాచారం.
సుకుమార్‌తో ఎంత మంచి అనుబంధం ఉన్నప్పటికీ బన్నీ ‘పుష్ప’ విషయంలో తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే ‘పుష్ప-2’ తర్వాత ఒక ఎమోషనల్ బ్రేక్ అవసరమని బన్నీ భావిస్తున్నాడట. ఈ పాత్ర ఎంత నచ్చినప్పటికీ.. ‘పుష్ప-2’ సక్సెస్ మీద కూడా ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ ‘పుష్ప-3’ చేసే విషయంలో బన్నీ అంత సుముఖంగా లేడని సమాచారం. పైగా త్రివిక్రమ్ సినిమా విషయంలోనూ బన్నీ చాాలా కష్టపడాల్సి ఉంది. ఆయనకు వేరే కమిట్మెంట్లు ఉన్నాయి. అవి వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు సుకుమార్ కూడా వేర ప్రాజెక్టులతో బిజీ అవబోతున్నాడని.. కాబట్టి సమీప భవిష్యత్తులో ఇద్దరూ కలిసి ‘పుష్ప-3’ చేసే అవకాశాలు లేవని.. ఫ్యూచర్లో అన్నీ కలిసి వస్తే సినిమా సాధ్యపడొచ్చని యూనిట్ వర్గాల సమాచారం.
This post was last modified on October 26, 2024 5:19 am
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…