Movie News

అలాంటి ప్రశ్న ఎలా వేశారో-అనన్య

కొత్త సినిమాల ప్రమోషన్లలో భాగంగా మీడియా ముందుకు వస్తున్న ఫిలిం సెలబ్రెటీలను కొందరు జర్నలిస్టులు వేస్తున్న అభ్యంతరకర ప్రశ్నల మీద ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో ఒక జర్నలిస్టు పనిగట్టుకుని ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. ఆయనకు హరీష్ శంకర్ లాంటి దర్శకులు గట్టిగా తలంటుపోశారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ జర్నలిస్ట్ మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఐతే తాజాగా ఓ మహిళా జర్నలిస్ట్ యువ కథానాయిక అనన్య నాగళ్ళను ‘పొట్టేల్’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా అడిగిన ప్రశ్న తీవ్ర వివాదాస్పదమైంది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇచ్చాకే అవకాశాలు ఇస్తారని నొక్కి వక్కాణిస్తూ.. మిమ్మల్ని కమిట్మెంట్ అడగలేదా అంటూ అనన్యను అడగడం మీద దుమారం రేగింది. ఈ ప్రశ్నకు అనన్య హుందాగా బదులిచ్చింది. తనకు అలాంటి అనుభవాలు లేవని.. ఇండస్ట్రీ గురించి అంత తప్పుగా మాట్లాడొద్దని ఆమె అంది.

అనన్యకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇండస్ట్రీలో కూడా ఆమె గురించి అందరూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘పొట్టేల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన ప్రసంగాన్ని ముగించబోతూ.. తమకు గౌరవం దక్కాలని కోరుకుంటున్నామంటూ పరోక్షంగా తాను ఎదుర్కొన్న ప్రశ్న మీద స్పందించింది అనన్య.

ఇక లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదం మీద ఆమె మరోసారి మాట్లాడింది. “ఇంత డైరెక్ట్‌గా వేదిక మీద ఓ నటిని సున్నితమైన అంశం మీద ఎలా ప్రశ్నించారని ఇంటికి వెళ్లాక కూడా ఆలోచించాను. సంస్కారం అనేది ఉంటే ఇలాంటి ప్రశ్నలు వేయరు కదా అనిపించింది. నటిగా గుర్తింపు తెచ్చుకోవాలన్నది నా కల. ఐదేళ్ల నుంచి దీని కోసం ఇంట్లో నేను పోరాడుతున్నా. ఇండస్ట్రీలోకి వెళ్లి కుటుంబం పరువు తీసిందని కొందరు ఆలోచిస్తారు. కానీ ‘పొట్టేల్’ చూసిన తర్వాత మా ఇంట్లో వాళ్లందరూ గర్వంగా ఫీలవుతారనుకుంటున్నా. నా నటన గురించి మా అమ్మ అందరికీ చెప్పుకుని సంతోషిస్తుందని అనుకున్నా. కానీ ఈ ప్రశ్న వేసి ఆ ఆనందం లేకుండా చేశారు” అంటూ అనన్య ఆవేదన వ్యక్తం చేసింది.

This post was last modified on October 23, 2024 10:11 am

Share

Recent Posts

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

18 minutes ago

ఇప్పటి వరకు గెలుపులు… ఇకపై మలుపులు

నరేంద్ర మోదీ... ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఆధునిక భారత దేశంలో అత్యంత ప్రభావవంతుడైన నాయకుడు... పాలకుడు. దేశంలో కొట్లాది మంది…

34 minutes ago

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

60 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

2 hours ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

2 hours ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

2 hours ago