తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. జోకులు, సెటైర్లు వేస్తూ ఫుల్ గా నవ్విస్తుంటారు. సినిమా డైలాగ్స్ తో సైలెంట్ గా ఉన్నవారిని కూడా నవ్విస్తుంటారు. ముఖ్యంగా తన డ్యాన్సుతో అదరగొడుతుంటారు. ఇప్పటికే పలుమార్లు స్టెప్పులతో అలరించిన ఆయన.. తాజాగా మరోసారి తన డ్యాన్స్ తో సందడి చేశారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు.
మల్లారెడ్డి మనవరాలు మర్రి శ్రేయ రెడ్డి పెళ్లి అక్టోబర్ 27వ తేదీన జరగనుంది. అందుకు గాను ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం ఏర్పాటు చేసిన సంగీత్ వేడుకల్లో మల్లారెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. స్టేజ్ పై జోరుగా.. ఫుల్ హుషారుగా స్టెప్పులేశారు. తాతా వచ్చాడే.. అదరగొట్టి పోతాడే సాంగ్, నాటు నాటు సాంగ్, డీజే టిల్లు సాంగ్స్ కు గ్రూప్ డ్యాన్స్ చేసి సందడి చేశారు. మంచి కాస్ట్యూమ్ తో, మనవళ్లను పక్కన పెట్టుకొని దుమ్ము దులిపేశారు.
తన ఊర మాస్ స్టెప్పులతో మల్లారెడ్డి ఓ రేంజ్ లో అలరించారు. 71 ఏళ్ల వయసులో 16 ఏళ్ల వయసు కుర్రాడిలా డ్యాన్స్ చేసి.. వేడుకకు వచ్చిన వారందరినీ ఆశ్చర్యపరిచారు. మనవరాలి సంగీత్ లో వేసిన డ్యాన్స్ కోసం కొద్ది రోజుల పాటు ఆయన ప్రాక్టీస్ చేశారని తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ తో ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.
మల్లారెడ్డినా మజాకా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సాంగ్ సెలక్షన్ అండ్ ఆయన డ్యాన్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఈ ఏజ్ లో అంత గ్రేస్ ఫుల్ గా స్టెప్పులు వేయడం గ్రేట్ అని అంటున్నారు. డ్యాన్స్ కెవ్వుకేక అని కొనియాడుతున్నారు. గతంలో మల్లారెడ్డి అనేకసార్లు డాన్స్ చేసినా.. మనవరాలి సంగీత్ లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్ అని, సూపర్ గా ఉందని చెబుతున్నారు.
This post was last modified on October 21, 2024 6:03 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…