కెరీర్ మొదట్లో కీర్తి సురేష్ కాస్త గ్లామరస్ పాత్రలకు దూరంగానే ఉంది. అయితే మారుతున్న ట్రెండ్ కు తగ్గట్లే ఆమె గ్లామర్ పరంగా కూడా కొత్తగా దర్శనమిస్తోంది. ఆమధ్య మహేష్ బాబు సర్కారు వారి పాటలో అమ్మడు క్యూట్ గ్లామర్ తో మెరిసింది. అనంతరం నితిన్ రంగ్ దే సినిమాలో రొమాంటిక్ సీన్స్ తో పెద్ద షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ తో మరింతగా మెరిసిపోతూ మోడల్స్ కి సైతం పోటీగా నిలబడుతోంది.
అయితే గ్లామర్ అనే విషయంలో హద్దులు దాటేలా కాకుండా తన హావభావాలతో కూడా అమ్మడు ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా కీర్తి నల్లటి మెరిసే చీరలో దర్శనమిచ్చిన విధానం కొత్తగా ఉంది. ముఖ్యంగా ఆమె కిల్లర్ లుక్స్ మైండ్ బ్లాక్ అనేలా ఉన్నాయని నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మెరిసే బ్లాక్ శారీలో మరింత అందంగా హైలెట్ అవుతోంది. ఇక తన అద్భుతమైన ఫ్యాషన్ స్టేట్మెంట్‌తో కీర్తి గ్లామరస్ పాత్రలు చేయడానికి సిద్ధమే అన్నట్లు హింట్ ఇస్తోంది.
ఇటీవల కీర్తి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయాలు చూడలేదు. తెలుగులో చివరగా వచ్చిన భోళా శంకర్ డిజాస్టర్ కాగా ఇటీవల తమిళంలో వచ్చిన రఘు తాత కూడా అంతగా ఆడలేదు. కల్కి సినిమాలో బుజ్జి క్యారెక్టర్ కు వాయిస్ ఇచ్చి మళ్ళీ జనాల దృష్టిని ఆకర్షించింది.
ఇక తెలుగులో అయితే ఆమెకి పెద్దగా ఆఫర్స్ ఏమి లేవు. బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమా చేస్తోంది. తమిళ్ థెరి సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ విధంగా ఫొటో షూట్స్ తో గ్లామర్ డోస్ పెంచుతున్న కీర్తి రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.
This post was last modified on October 17, 2024 4:04 pm
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్పై జరిగిన దాడి కేసు సినీ పరిశ్రమను కుదిపేసింది. ఈ నెల 19న తెల్లవారుజామున 2.30…
తెలుగులో సంక్రాంతి పండక్కి సినిమాల సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? టాలీవుడ్కు సంబంధించి ఇదే బిగ్గెస్ట్ షార్ట్ సీజన్. ఈ…
ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ వారం తిరక్కుండానే వంద కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.…
న్యూ ఇయర్ సందర్బంగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి... బీజేపీ మహిళా నేత, సినీ…
ఏదైనా పెద్ద సినిమాకు సంగీత దర్శకుడిని ఎంచుకునే పని స్టార్ హీరోల దర్శకులకు పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో…
టీడీపీ… దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఆవిర్భవించిన 9 నెలల కాలంలోనే అధికారం చేజిక్కించుకున్న పార్టీగా టీడీపీపై ఉన్న రికార్డు…