కంగువ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 ఉంటుందని, గత వారమే దాని ప్రొడ్యూసర్లతో మాట్లాడానని కానీ చాలా టైం అయితే పడుతుందని చెప్పిన మాటలు అభిమానుల మధ్య విపరీతంగా వైరలవుతున్నాయి. గతంలో రాజమౌళినే ఈ ప్రశ్న అడిగినప్పుడు ఉండొచ్చని మాటవరసకు అని దాటవేశారు తప్పించి నిర్ధారణగా చెప్పలేదు. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే బాహుబలి 3కి ఏ మేరకు తెరకెక్కే సూచనలున్నాయో అర్థమవుతుంది. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబు 29 కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి నుంచి సెట్స్ కు వెళ్లబోతోంది.
ఎంతలేదన్నా దీని మీద పెడుతున్న బడ్జెట్ కి రెండేళ్లకు పైగానే పడుతుంది. ఇంకో ఏడాది ఎక్స్ ట్రా అయినా ఎంత మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. బాహుబలి మీద అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మాట నిజమే కానీ ఇంత గ్యాప్ తో మూడో భాగమంటూ కొనసాగింపు తీసుకొస్తే వర్కౌటవుతుందా అంటే అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఖచ్చితంగా ఉంటుంది. కానీ రాజమౌళి, ప్రభాస్ లు దీని పట్ల ఎంత మాత్రం సీరియస్ గా ఉన్నారనేది కీలకం. ఎందుకంటే రానా, అడివి శేష్ పాత్రలు చనిపోయాయి. కొత్త విలన్లను పెట్టాలి. అనుష్కను ఓల్డ్ గెటప్ లోనే కొనసాగించాలి.
ఇవన్నీ కథ పరంగా సవాళ్లు విసిరే అంశాలే. అసలే రాజమౌళి భవిష్యత్తులో మహాభారతం తీసే ఆలోచనలో ఉన్నారు. నిజంగా పూనుకుంటే దానికి ఎంత కాలం ఖర్చవుతుందో ఊహకందదు. అయినా జ్ఞానవేల్ చెప్పిన ప్రకారం చూస్తే ది రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాల తర్వాత స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఉంటాయి. అవయ్యాక బాహుబలి 3 అంటున్నారు. అంటే ఎంతలేదన్నా 2030 అయ్యేలా ఉంది. ప్రభాస్ అప్పటికంతా ఎన్ని కొత్త సినిమాలు చేస్తాడో, ఎవరెవరికి కమిట్ మెంట్లు ఇస్తాడో చెప్పలేంగా. వినడానికి బాగానే ఉంది కానీ బాహుబలి 3 ది ఎక్స్ టెన్షన్ ఇప్పట్లో జరిగే పనైతే కాదు.
This post was last modified on October 17, 2024 12:01 pm
ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ…
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలకు తెర లేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా వాణిజ్య రాజధాని న్యూయార్క్……
గత ఏడాది డిసెంబర్ అన్నారు. తర్వాత ఏప్రిల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు దసరా లేదా దీపావళికి రావడం అనుమానమే అంటున్నారు.…
https://youtu.be/2y_DH5gIrCU?si=-Esq17S1eaW7D4yg ఒక టీజర్ కోసం స్టార్ హీరో అభిమానులు ఎదురు చూడటం మాములే కానీ పెద్ది విషయంలో మాత్రం ఇది…
లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో డబుల్ షాక్ తిన్నాడు సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ దెబ్బతో ఆయనకు సినిమా…