పల్లీ నూనెను భారతీయ వంటకాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇతర నూనెలతో పోలిస్తే, దీని రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నూనె ఉపయోగించడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ నూనె ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు అనేక కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది.
వేరుసెనగ నూనె లేదా పల్లి నూనె లో ఎక్కువగా హెల్దీ ఫ్యాట్స్ , శాచ్యురేటెడ్ ఫ్యాట్, విటమిన్ ఈ, మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్, పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్, ఫైటోస్టెరాల్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
కొలెస్ట్రాల్ కంట్రోల్:
పల్లీ నూనెలోని మోనోఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మంచివి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సమస్యలు తగ్గిస్తాయి. ఈ నూనె వాడడం వల్ల స్ట్రోక్స్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది అని అధ్యయనాలలో తేలింది. పల్లీ నూనెలో విటమిన్ ఈ, మోనో మరియు పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
డయాబెటిస్ నియంత్రణ:
పల్లీ నూనెలో పాలీ అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ నూనె వాడడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
మెదడు ఆరోగ్యం:
పల్లీ నూనెలో అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే అల్జీమర్స్ లాంటి సమస్యలను తగ్గించి, మెదడు టాక్సిన్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి.
చర్మం సంరక్షణ:
పల్లీ నూనెలో అధికంగా ఉండే విటమిన్ ఈ ,చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి, ఎగ్జిమా, సోరియాసిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.ఈ నూనె సెల్ డ్యామేజ్ ను తగ్గించి మీ చర్మం ఫ్లెక్సిబిలిటీను కాపాడుతుంది.
పల్లీ నూనె మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. అయితే, దీనిని మితంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. కొంతమందికి పల్లీ నూనె సరిపడదు. ముఖ్యంగా పిల్లల్లో అలర్జీలు రావచ్చు. అందుకే, జాగ్రత్తగా ఉండాలి.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా న్యూట్రిషన్ ను సంప్రదించడం మంచిది.
This post was last modified on January 16, 2025 7:30 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…